పాకిస్తాన్ లో కరోనా విజృంభణ... ఒక్కరోజులో 131మంది...

By telugu news teamFirst Published Mar 17, 2020, 10:42 AM IST
Highlights

ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. భారత్ లో కరోనా బారినపడి ఇప్పటి వరకు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.  మరో వంద మందికి పైగా వైరస్ సోకడంతో ప్రత్యేకంగా చికిత్స తీసుకుంటున్నారు. 
 

మహమ్మారి కరోనా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. తాజాగా... దీని ప్రభావం పాక్ పై కూడా పడింది.  ఇప్పటికే యూరప్ దేశాల్లో ఈ వైరస్ విలయతాండవం చేస్తోంది. దీని తాకిడికి జనాలు పిట్టలు రాలిపోయినట్లు రాలిపోతున్నారు.చైనా తర్వాత ఇటలీ, స్పెయిన్ దేశాల్లో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. 

Also Read బిగ్ బ్రేకింగ్: కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం ట్రంప్ భారీ కుట్ర..?

ఇప్పుడిప్పుడే.. భారత్ ని కూడా ఈ వైరస్ అతలాకుతలం చేయడానికి రెడీ అవుతోంది. కాగా.. దీని భారి నుంచి ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వాలు తమ ప్రయత్నాలు తాము చేస్తున్నాయి. ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. భారత్ లో కరోనా బారినపడి ఇప్పటి వరకు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.  మరో వంద మందికి పైగా వైరస్ సోకడంతో ప్రత్యేకంగా చికిత్స తీసుకుంటున్నారు. 

 ఇదిలా ఉంటే మన పొరుగుదేశమైన పాకిస్థాన్ లో దీని ప్రభావం కాస్త గట్టిగానే ఉంది. కేవలం 24గంటల్లో 131 మందికి కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. దీంతో పాకిస్థాన్‌లో మొత్తం 180కి పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో పాక్ ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి. కాగా.. ఇప్పటకే 162 దేశాలకు ఈ కరోనా మహమ్మారి వ్యాపించింది. కరోనా సోకడంతో.. ఏడువేల మందికి పైగా మరణించగా.. దాదాపు రెండు లక్షల మంది వరకు ఆస్పత్రి పాలయ్యారు.

click me!