థాయ్ లాండ్ లో దారుణం.. డే కేర్ సెంటర్ లో మాజీ పోలీసు కాల్పులు.. 34 మంది మృతి..

By team teluguFirst Published Oct 6, 2022, 3:11 PM IST
Highlights

థాయ్ లాండ్ లోని ఓ డే కేర్ సెంటర్ పై మాజీ పోలీసు ఆఫీసర్ తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 34 మంది పిల్లలు, పెద్దలు చనిపోయారు.

థాయ్ లాండ్ లో దారుణం జ‌రిగింది. ఆ దేశంలోని ఈశాన్య ప్రావిన్స్ లోని చిల్డ్రన్స్ డే కేర్ సెంటర్ లో గురువారం మాజీ పోలీసు పోలీసులు తుపాకీతో విచ‌క్ష‌ణా ర‌హితంగా కాల్పులు జ‌రిపాడు. ఈ ఘ‌ట‌న‌లో 22 మంది చిన్నారులు మృతి చెందారు. మ‌రో 14 మంది పెద్ద‌లు చనిపోయారు.

ముకేశ్ అంబానీ కుటుంబానికి బెదిరింపులు.. బిహార్‌లోని నిరుద్యోగి అరెస్టు

ఈ కాల్పులకు పాల్ప‌డిన దుండ‌గుడు చివ‌రికి త‌న‌ను తాను కాల్చుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. స్థానిక మీడియా తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఈ ఘ‌ట‌న‌లో మొత్తంగా 34 మంది మృతి చెందారు. మృతుల్లో ఓ పోలీసు అధికారి కూడా ఉన్నారు. ఈ విష‌యాన్ని స్థానిక పోలీసులు ఓ ప్ర‌క‌ట‌న‌లో ధృవీక‌రించారు.

దుర్గా విగ్రహాల నిమజ్జనం.. విషాద ఘ‌ట‌న‌ల్లో 10 మంది మృతి.. ప‌లువురు గ‌ల్లంతు

ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందిన వెంట‌నే ఆ దేశ ప్ర‌ధాని స్పందించారు. ఈ కాల్పుల‌కు కార‌ణ‌మైన వారిని ప‌ట్టుకోవ‌డానికి అన్ని చ‌ర్య‌లూ తీసుకోవాల‌ని అన్ని ఏజెన్సీల‌ను ఆదేశించారు. ఇదిలా ఉండ‌గా.. థాయ్ లాండ్ లో సామూహిక కాల్పుల ఘటనలు సాధారణంగా జ‌ర‌గ‌వు. కానీ తుపాకీని క‌లిగి ఉన్న‌వారి సంఖ్య ఎక్కువ‌గా ఉంది. అయితే అధికారిక లెక్కల ప్రకారం అక్రమ ఆయుధాల సంఖ్య కూడా  పెద్దగా లేదు.

శాన్ మిగ్యుల్ టోటోలాపాన్‌లోని సిటీ హాల్ లో దుండగుల కాల్పులు.. 18 మంది మృతి, ముగ్గురికి గాయాలు

కాగా.. 2020 సంవ‌త్స‌రంలో ఓ ఆస్తి ఒప్పందం విష‌యంలో వివాదం చెల‌రేగింది. దీంతో కోపంగా ఉన్న ఓ సైనికుడు తుపాకీతో దాదాపు 29 మందిని చంపాడు. ఈ ఘ‌ట‌నలో 57 మంది గాయ‌ప‌డ్డారు. 

Thailand attack: 22 children among 34 killed in nursery mass shooting.

The attacker, a former policeman, also killed his wife and child before shooting himself dead. pic.twitter.com/kFszD2EO7I

— Chu Pablo 🌐 (@geomar_depedro)
click me!