
పాకిస్థాన్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ హిందూ మహిళ కడుపులో శిశువు తల నరికి, దానిని అందులోనే వదిలేసి ఆపరేషన్ చేశారు. దీంతో మహిళ ప్రాణాప్రాయ స్థితికి చేరుకుంది. బాధితురాలిని వెంటనే మరో హాస్పిటల్ కు తీసుకెళ్లగా మళ్లీ ఆపరేషన్ చేసి తలను తొలగించారు. ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు.
గర్భిణీ భార్యముందే భర్తమీద కత్తులతో దాడి.. వ్యక్తి మృతి...
పాకిస్థాన్ లోని సింధ్ ప్రావిన్స్ లోని ఓ గ్రామీణ ఆరోగ్య కేంద్రంలోని సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారు. డెలివరీ కోసం వచ్చిన మహిళను ప్రమాదకర స్థితిలోకి నెట్టేశారు. తార్పార్కర్ జిల్లాలోని మారుమూల ప్రాంతానికి చెందిన ఓ హిందూ మహిళ (32) తన సమీపంలోని గ్రామీణ ఆరోగ్య కేంద్రానికి (RHC) డెలివరీ కోసం వెళ్లింది. అయితే ఆ సమయంలో అక్కడ గైనకాలిస్ట్ అందుబాటులో లేరు. దీంతో అనుభవం లేని సిబ్బంది ఆమెకు సిజేరియన్ చేయాలని ప్రయత్నించారు. ఈ సమయంలో శిశువు తల నరికి కడుపులోనే ఉంచి కుట్లు వేశారు.
కొంత సమయంతో తరువాత మహిళ పరిస్థితి విషయమించడంతో ఆమె కుటుంబ సభ్యులు జంషోరోలోని లియాఖత్ యూనివర్శిటీ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సైన్సెస్ (LUMHS)కు తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు ఆమె పరిస్థితిని గమనించి ఎంతో కష్టపడి శిశువు తలను బయటకు తీశారు. ఆమె ప్రాణాలను కాపాడారు. ఈ ఘటనను ప్రభుత్వం సిరియస్ గా తీసుకొంది. దీనికి కారణమైన దోషులను తేల్చేందుకు విచారణ కమిటినీ నియమించింది.
Ram Mandir Trust: రాములోరి ఆలయానికి చెల్లని చెక్కులు.. 22 కోట్ల విలువైన చెక్కులు బౌన్స్
ఈ ఘటనపై (LUMHS) గైనకాలజీ విభాగం అధిపతి ప్రొఫెసర్ రహీల్ సికిందర్ మాట్లాడుతూ.. ‘‘ భిల్ హిందూ మహిళ తార్పార్కర్ జిల్లాలోని మారుమూల గ్రామానికి చెందినది. అంతకు ముందు ఆమె తన ప్రాంతంలోని గ్రామీణ ఆరోగ్య కేంద్రానికి (RHC) వెళ్ళింది. కానీ మహిళా గైనకాలజిస్ట్ అందుబాటులో లేకపోవడంతో, అనుభవం లేని సిబ్బం ది ఆమెకు చికిత్స చేయడం ప్రారంభించారు. కానీ సిబ్బంది నిర్లక్ష్యంతో తల్లి కడుపులో శిశువు తల నరికి లోపల వదిలేశారు. ఇంతలో మహిళ పరిస్థితిస్థి విషమంగా మారింది. ఆ తర్వాత దగ్గరలోని మిఠి హాస్పిటల్ కు తీసుకెళ్లినా ఫలితం లేదు. చివరికి కుటుంబ సభ్యులు ఆమెను LUMHSకి తీసుకువచ్చారు. ఇక్కడ ఆమెకు ఆపరేషన్ చేశారు. పాప తల లోపల చిక్కుకుపోయింది. తల్లి గర్భాశయం ఛిద్రమైంది. ఆపరేషన్ చేసి ఆమె పొత్తికడుపును తెరిచి తలను బయటకు తీయాల్సి వచ్చింది ’’ అని ఆయన తెలిపారు. ఈ ఘోర తప్పిదానికి సింధ్ హెల్త్ సర్వీ సెస్ డైరక్టర్ జుమాన్ బహోటో ప్రత్యేక విచారణకు ఆదేశించారని సికిందర్ తెలిపారు.