Latest Videos

అమెరికా వైట్ హౌస్ సమీపంలో కాల్పులు.. ఒకరు మృతి, పలువురికి గాయాలు..

By SumaBala BukkaFirst Published Jun 20, 2022, 1:05 PM IST
Highlights

అమెరికా మరోసారి దద్దరిల్లింది. తుపాకీ కాల్పుల్లో ఒక పోలీసు అధికారి మరణించాడు. అయితే ఈ ఘటన వైట్ హౌస్ సమీపంలో జరగడం గమనార్హం. 

అమెరికా : అమెరికాలో మరోసారి తుపాకీ మోత మోగింది. శ్వేతసౌధం సమీపంలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో పోలీస్ అధికారి సహా పలువురికి బుల్లెట్లు తగిలాయి. అమెరికా రాజధాని నగరమైన వాషింగ్టన్ డిసి 14 అండ్ యూ వీధిలోని జునెటీంత్ మ్యూజిక్ కన్సెర్ట్ సమీపంలో దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఫైరింగ్ లో ఒకరు మృతి చెందగా.. పోలీసు అధికారి సహా పలువురికి తూటాలు తగిలినట్లు మెట్రోపాలిటన్ పోలీసు విభాగం తెలిపింది.

ఈ ఘటన అధ్యక్ష భవనమైన శ్వేత సౌధానికి సమీపంలోనే జరిగినట్లు స్థానిక మీడియా తెలిపింది. సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు… క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి ఉందని చెప్పారు. అమెరికాలో కాల్పుల ఘటనలు అధికం కావడం వల్ల తుపాకీ నియంత్రణ చట్టాన్ని తీసుకువస్తున్నట్లు అధ్యక్షుడు joe biden ఇటీవలే తెలిపారు. 18-21 ఏళ్ల మధ్య వయసున్న వారు తుపాకులు కొనుగోలు చేయకుండా చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టంతో ఎవరి హక్కులకు భంగం కలిగించడం తమ ఉద్దేశం కాదని ఇది ప్రజల రక్షణ కోసమే అని బైడెన్ చెప్పారు.

మే 24న అమెరికాలోని ఉవాల్డే స్థానిక ప్రాథమిక పాఠశాలలో 18 ఏళ్ల యువకుడు జరిపిన కాల్పుల్లో.. 19 మంది పిల్లలతో సహా మరో ముగ్గురు మృతి చెందారు. సెంట్రల్ వర్జీనియాలో గ్రాడ్యుయేషన్  పార్టీ జరుగుతున్న సమయంలో ఓ 20 ఏళ్ల యువకుడు తుపాకీతో చెలరేగాడు. మే 31న జరిగిన ఈ ఘటనలో ఒకరు మరణించగా.. ఏడుగురు గాయపడ్డారు.

Texas School Shooting : తుపాకీ సంస్కృతికి వ్యతిరేకంగా పోరాడాలి.. జో బిడెన్ పిలుపు..

కాగా, అమెరికాలో మే 25న టెక్సాస్లోని ఒక ఎలిమెంటరీ స్కూల్లో 18 ఏళ్ల యువకుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 18 మంది విద్యార్థులతో సహా 21 మంది మృత్యువాత పడ్డారు. మృతి చెందిన విద్యార్థుల వయసు నాలుగు నుంచి 14 ఏళ్ల మధ్య ఉంటుందని అక్కడి అధికారులు తెలిపారు. గత కొన్నేళ్లలో ఇది అత్యంత ఘోరమైన సంఘటన అని ఆ రాష్ట్ర గవర్నర్ గ్రేగ్ అబాట్ వెల్లడించారు. మెక్సికన్ సరిహద్దుల్లోని ఉవాల్డేలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ తర్వాత పోలీసుల కాల్పుల్లో దుండగులు చనిపోయాడు. అమెరికా కాలమానం ప్రకారం మధ్యాహ్నం సమయంలో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి.  

దీంతో వెంటనే స్థానిక పోలీసులు ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నాయి.  దుండగుడు తన కారును వదిలేసి రోబ్ ఎలిమెంటరీ పాఠశాలలోకి ప్రవేశించాడు అని, తన వద్ద తుపాకీతో పాటు రైఫిల్ కూడా ఉండి ఉండొచ్చని గవర్నర్ తెలిపారు. ఈ పాఠశాలలో మొత్తం 500 మంది కంటే ఎక్కువే విద్యార్థులు చదువుతున్నారు. ఈ ఘటన నేపథ్యంలో  వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. పాఠశాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.  కాల్పుల సమాచారాన్ని అధ్యక్షుడు జో బైడెన్ కు  అధికారులు తెలిపారు. కాల్పులు జరిపింది..స్థానికంగా నివసించే యూఎస్ పౌరుడు సాల్వడార్ రామోస్ అని అనుమానిస్తున్నారు. అతను కూడా పోలీసుల ఎదురు కాల్పుల్లో చనిపోయాడని గవర్నర్ చెప్పారు.

2018లో ఫ్లోరిడాలోని పార్క్ ల్యాండ్ లో జరిగిన కాల్పుల్లో 14 మంది హై స్కూల్ విద్యార్థులతో పాటు ముగ్గురు టీచర్లు మృతి చెందారు. ఆ ఘటన తర్వాత ఇదే అత్యంత దారుణ సంఘటన. 2020లో అమెరికాలో జరిగిన కాల్పుల్లో 19,350 మంది చనిపోయారు. ఇది  2019 తో పోలిస్తే 35 శాతం అధికమని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) తాజాగా పేర్కొంది. ఈ ఘటనతో అమెరికాలో మరోసారి గన్ కల్చర్ మీద ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

click me!