పెళ్లైన పది నెలలకు మహిళకు షాక్.. అసలు తన భర్త అబ్బాయి కాదని తెలిసి..!

Published : Jun 20, 2022, 04:05 PM IST
 పెళ్లైన పది నెలలకు మహిళకు షాక్.. అసలు తన భర్త అబ్బాయి కాదని తెలిసి..!

సారాంశం

దాదాపు పది నెలల తర్వాత ఆమెకు ఊహించని షాక్ తగిలింది. తాను పెళ్లి చేసుకున్న వ్యక్తి ఒక అమ్మాయి కాదని.. అబ్బాయి అని తేలియడం గమనార్హం. 

వారిద్దరికీ డేటింగ్ యాప్ లో పరిచయం ఏర్పడింది. దీంతో.. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా.. వారు సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు. అయితే.. వీరి పెళ్లి జరిగిన దాదాపు పది నెలల తర్వాత ఆమెకు ఊహించని షాక్ తగిలింది. తాను పెళ్లి చేసుకున్న వ్యక్తి ఒక అమ్మాయి కాదని.. అబ్బాయి అని తేలియడం గమనార్హం. ఈ సంఘటన ఇండోనేషియాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇండియా టుడూ కథనం ప్రకారం...  ఇండోనేషియా కి చెందిన ఓ మహిళకు డేటింగ్ యాప్ లో ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. అతను ఓ సర్జన్ అని, వ్యాపారాలు కూడా ఉన్నాయని చెప్పాడు. దీంతో... ఇంట్లో చెప్పకుండా సీక్రెట్ గా వీరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత యువతి.. తన కుటుంబ  సభ్యులకు దూరంగా ఉండటం గమనార్హం.

అయితే.. పెళ్లి తర్వాత డబ్బు కోసం తరచూ సదరు వరుడు.. తన భార్య, ఆమె కుటుంబసభ్యులను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టడం గమనార్హం. సదరు యువతి  ఆమె కుటుంబం నుంచి దాదాపు రూ.15లక్షల ను తన భర్త కుటుంబానికి ఇచ్చింది. వీరి పెళ్లి కి సంబంధించి చట్టమైన పత్రాలు ఏమీ లేకపోవడం గమనార్హం. కాగా... తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే.. తను పెళ్లి చేసుకన్న వ్యక్తి అసలు అబ్బాయి కాదని.. అమ్మాయి అని తేలడం గమనార్హం. దీంతో మోసపోయానని గుర్తించిన యువతి.... వెంటనే తన కుటుంబసభ్యులకు ఈ విషయం తెలియజేసింది. వీరి కేసు ప్రస్తుతం అక్కడ కోర్టులో ఉంది. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే