దారుణం.. యువ‌తిని చంపేసి శరీర భాగాలను సూట్‌కేసుల్లో భద్రపర్చిన దుండగుడు.. ఎక్కడంటే

By team teluguFirst Published Sep 22, 2022, 9:56 AM IST
Highlights

న్యూయార్క్ లోని ఓ అపార్ట్ మెంట్ లో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ ప్లాట్ లో యువతి మృత‌దేహం శరీర భాగాలు పలు సూట్ కేసుల్లో కనిపించాయి. 

న్యూయార్క్ లో దారుణం చోటు చేసుకుంది. యువ‌తిని ఓ దుండ‌గుడు దారుణంగా హ‌త్య చేశాడు. ఆమె శ‌రీరాన్ని ముక్క‌లుగా క‌ట్ చేసి సూట్‌కేసుల్లో దాచిపెట్టాడు. అనంత‌రం అక్క‌డి నుంచి పారిపోయాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

పది రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ..

ఈస్ట్ న్యూయార్క్‌లోని 315 లిన్‌వుడ్ స్ట్రీట్‌లో మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో ఓ అపార్ట్‌మెంట్ లోని ఆరో అంతస్థులోని ఇంటిలో భ‌యంక‌ర‌మైన దృశ్యాలు క‌నిపించాయి. ఆ ప్లాట్ లో ఉన్న అనేక సూట్ కేసుల్లో ఓ యువ‌తికి చెందిన శ‌రీర భాగాలు క‌నిపించాయి. ఆ ప్రాంతమంతా ర‌క్తంతో నిండిపోయింది.

జాబ్ ప్రమోషన్ కోసం రికమెండ్ చేయలేదని బాస్ కుటుంబాన్ని హతమార్చిన ఉద్యోగి.. 8 ఏళ్ల తర్వాత అరెస్టు

ఆ ప్లాట్ నుంచి దుర్వాస‌న రావ‌డంతో అపార్ట్‌మెంట్ వాసులు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. దీంతో వారు అక్క‌డికి చేరుకొని ప్లాట్ ను ఓపెన్ చేసి చూడ‌గా.. ఈ దృశ్యాలు క‌నిపించాయి. ఈ విష‌యంలో ‘న్యూయార్క్ పోస్ట్’తో అపార్ట్ మెంట్ వాసులు మాట్లాడారు. కొంత కాలంగా ఆ ప్లాట్ లో 20 ఏళ్ల యువ‌తి త‌న భాయ్ ఫ్రెండ్ తో క‌లిసి ఉండేద‌ని అన్నారు. అత‌డితో ఆమె త‌ర‌చూ గొడ‌వ‌ప‌డుతుండేద‌ని చెప్పారు.

డొనాల్డ్ ట్రంప్ పై అత్యాచారం ఆరోపణలు.. రచయిత్రి కారోల్ క్లెయిమ్..

అయితే ఈ ఘ‌ట‌నలో ప్ర‌మేయం ఉంద‌ని భావిస్తున్న నిందితుడిని గుర్తించామ‌ని న్యూయార్క్ పోలీసులు తెలిపారు. కొన్ని రోజులుగా క‌నిపించ‌కుండా పోయిన యువ‌తి ఓ పార్ట్ మెంట్ లో ర‌క్త‌పు మ‌డుగులో క‌నిపించింద‌ని పేర్కొన్నారు. శ‌రీర‌పు అవ‌య‌వాల‌ను సేక‌రించి, ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపించామ‌ని చెప్పారు. తదుపరి విచారణ కొన‌సాగుతుంద‌ని తెలిపారు. 
 

click me!