న్యూక్లియర్ దాడి గురించి సీరియస్‌గానే చెప్పా.. ఆ దేశాలకు వార్నింగ్.. మిలిటరీ పాక్షిక తరలింపునకు పుతిన్ ఆదేశాలు

By Mahesh KFirst Published Sep 21, 2022, 2:09 PM IST
Highlights

ఉక్రెయిన్‌కు ఆయుధ, సైనిక మద్దతు ఇస్తున్న పశ్చిమ దేశాలకు రష్యా ఇది వరకే వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా న్యూక్లియర్ అటాక్ గురించి రష్యా మాట్లాడింది. తాము న్యూక్లియర్ అటాక్ గురించి సదరాగా కామెంట్ చేయలేదని, అది వాస్తవబద్ధమైన హెచ్చరింపు అని వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. ఈ మేరకు మిలిటరీ పాక్షిక తరలింపునకు ఆదేశాలు ఇచ్చినట్టు వివరించారు.
 

న్యూఢిల్లీ: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి ఇంకా తెరపడలేదు. ఇటీవలి కాలంలో రష్యాకు ఉక్రెయిన్‌లో పలు ఎదురుదెబ్బలు తగిలాయి. పలుప్రాంతాలను ఉక్రెయిన్ తిరిగి స్వాధీనం చేసుకోగలిగింది. ‘మిలిటరీ ఆపరేషన్’ నుంచి రష్యా మెల్లిగా విరమించుకుంటుందనే ఆలోచనలు వచ్చాయి. కానీ, అవి తప్పు అని తాజాగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన హెచ్చరికలు తెలియజేస్తున్నాయి. తాను న్యూక్లియర్ అటాక్ చేసిన వ్యాఖ్యలు సరదాగా చేయలేదని, తమ భౌగోళిక సమగ్రతకు ముప్పు వస్తే న్యూక్లియర్ దాడి చేస్తామని స్పష్టం చేసింది. ఇందుకోసం ఇప్పటికే మిలిటరీ మొబలిలైజేషన్‌ కోసం పుతిన్ పలు ఆదేశాలు చేశారు. ప్రస్తుతం రిజర్వ్‌లో ఉన్నవారు.. గతంలో సైన్యంలో చేసినవారు.. అందుకు సంబంధించిన అనుభవం, నైపుణ్యం ఉన్నవారు తిరిగి సైనిక విధుల్లో చేరాలని ఆదేశించారు.

పశ్చిమ దేశాలు ఉక్రెయిర్‌కు ఆయుధ, సైనిక సహకారం అందించడంపై రష్యా సీరియస్ అయిన సంగతి తెలిసిందే. పశ్చిమ దేశాలే ఈ యుద్ధాన్ని ఎగదోస్తున్నాయని వాదించింది. తమ దేశ అంతర్గత భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంటే.. న్యూక్లియర్ దాడికి సైతం తాము వెనుకడుగు వేయబోమని స్పష్టం చేసింది. అయితే, తాజాగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి న్యూక్లియర్ దాడి ప్రస్తావన తెచ్చారు.

తాను న్యూక్లియర్ దాడి గురించి సరదాగా మాట్లాడలేదని, లేదా బెదిరించాలనే లక్ష్యంతో ఆ వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. తమ దేశ భౌగోళిక సమగ్రతకు ముప్పు కలిగిస్తే తాము అన్ని రకాల ఆయుధాలు ప్రయోగిస్తామని, ప్రజల రక్షణ కోసం న్యూక్లియర్ దాడి కూడా చేయొచ్చని తెలిపారు.

రష్యా దగ్గర చాలా ఆయుధాలు ఉన్నాయని, తమను పశ్చిమ దేశాలు బెదిరిస్తే.. లేదా ముప్పు తెస్తే వాటికి సరైన సమాధానం చెబుతామని, ఇదేదో యధాలాపంగా అంటున్న మాట కాదని వార్నింగ్ ఇచ్చారు. ఉక్రెయిన్ రక్షణకు పశ్చిమ దేశాల సహాయాన్ని వ్యతిరేకించారు.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే పశ్చిమ దేశాలు రష్యాను బలహీనం చేసి,విభజించాలని కుట్రలు చేస్తున్నదని తెలిపారు. పశ్చిమ దేశాలు ఇప్పటికే తమ హద్దు దాటిపోయాయని పేర్కొన్నారు.

రష్యా అధీనంలోని ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాలను వేర్పాటువాదుల చేతుల్లో ఉన్నాయి. రష్యాలో అంతర్భాగంగా ఉండటానికి తాము రెఫరెండం నిర్వహిస్తామని వేర్పాటువాద నేతలు ప్రకటించారు. ఆ  తర్వాతి రోజే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ఈ ప్రసంగంలో పశ్చిమ దేశాలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

click me!