ఫుట్ బాల్ దిగ్గజం డిగో మారడోనా పై అత్యాచార ఆరోపణలు..!

Published : Nov 23, 2021, 10:04 AM IST
ఫుట్ బాల్ దిగ్గజం డిగో మారడోనా పై అత్యాచార ఆరోపణలు..!

సారాంశం

20 సంవత్సరాల క్రితమే ఆయన తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె వయసు 37ఏళ్లు కాగా..  తాను మైనర్ గా ఉన్న సమయంలో తన ఇష్టం లేకుండా.. లైంగిక దాడికి పాల్పడినట్లు ఆమె పేర్కొన్నారు.

సాకర్ ఆల్ టైం గ్రేట్ ఆటగాడు, అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గజం డిగో మారడోనా పై క్యూబాకు చెందిన ఓ మహిళ అత్యాచార ఆరోపణలు చేసింది.  డిగో మారడోనా.. గతేడాది గుండెపోటుతో చనిపోయిన సంగతి తెలిసిందే. 60ఏళ్ల వయసులో.. ఆయన గుండె పోటుతో ప్రాణాలు కోల్పోయారు. నవంబర్‌ ఆరంభంలో మెదడులో రక్తనాళాలు మూసుకుపోవడంతో ఆయన శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆ తర్వాత మద్యం వ్యసనం నుంచి బైటపడేందుకు చికిత్స తీసుకుంటూ వచ్చారు.  చివరకు అనారోగ్య సమస్యతో ప్రాణాలు కోల్పోయారు.

ఆయన చనిపోయిన సరిగ్గా సంవత్సరం తర్వాత.. ఆయనపై ఓ మహిళ అత్యాచార ఆరోపణలు చేయడం  తీవ్ర చర్చనీయాంశమైంది. 20 సంవత్సరాల క్రితమే ఆయన తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె వయసు 37ఏళ్లు కాగా..  తాను మైనర్ గా ఉన్న సమయంలో తన ఇష్టం లేకుండా.. లైంగిక దాడికి పాల్పడినట్లు ఆమె పేర్కొన్నారు.

తాను ఆయనను కలిసినప్పుడు ఆయన వయసు 40ఏళ్లు అని... అప్పుడు ఆయన క్యూబో లో ఏదో  చికిత్స పొందుతున్నాడని.. అప్పుడే పరిచయం ఏర్పడిందని ఆమె పేర్కొంది. తొలుత తనతో ఆయన చాలా మంచిగా ఉన్నాడని... రెండు నెలల తర్వాత అంతా మారిపోయిందని.. ఆయన తన పట్ల ప్రవర్తించే తీరు మారిందని ఆమె పేర్కొన్నారు.

మొదట్లో తాను కూడా డిగో మారడోనా ను ప్రేమించానని.. అయితే.. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నానని.. దానికి ఆయనే కారణమని ఆమె వాపోయింది. నవంబర్ 25న మారడోనా వర్ధంతి మొదటి వార్షికోత్సవం సందర్భంగా అతని గురించి టీవీ సిరీస్‌లో చెప్పబడుతున్న కొన్ని కథనాలను బ్యాలెన్స్ చేయడానికి చాలా సంవత్సరాల మౌనం తర్వాత తాను మాట్లాడుతున్నానని ఆమె చెప్పడం గమనార్హం. 

ఇదిలా ఉండగా...సాకర్‌ ప్రపంచంలో ఆల్ టైం గ్రేట్ ఆటగాడిగా పేరు తెచ్చుకున్న మారడోనా 1986 ప్రపంచకప్‌లో అర్జెంటీనా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఆ వరల్డ్ కప్ అర్జెంటీనా సాధించింది. అర్జెంటీనా తరఫున 91 మ్యాచ్‌లు ఆడిన మారడోనా 34 గోల్స్‌ చేశారు. మొత్తం నాలుగు ప్రపంచకప్‌లలో ఆయన ఆడారు.

1990లో ఇటలీలో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో మారడోనా నాయకత్వంలో ఆడిన అర్జెంటీనా జట్టు పశ్చిమ జర్మనీ చేతిలో ఓడిపోయింది. 1994లో అమెరికాలో జరిగిన మ్యాచ్‌కు కూడా ఆయనే నాయకత్వం వహించగా, అప్పట్లో ఆయన డ్రగ్స్‌ పరీక్షల్లో పట్టుబడటంతో జట్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆయన తన కెరీర్‌ రెండో అర్ధభాగంలో కొకైన్‌కు బానిసగా మారారు. 1991లో జరిపిన టెస్టుల్లో కొకైన్‌ తీసుకున్నట్లు వెల్లడి కావడంతో ఆయన్ను 15 నెలలపాటు బహిష్కరించారు. 1997లో తన 37వ ఏట మారడోనా ఫుట్‌బాల్ క్రీడ నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించారు.

PREV
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?