చైనీస్ రెస్టారెంట్ లో అమెరికా యువకుల అరాచకం.. లోపలికి ప్రవేశించి ఫర్నీచర్ ధ్వంసం.. వీడియో వైరల్

Published : Mar 09, 2023, 10:14 AM IST
చైనీస్ రెస్టారెంట్ లో అమెరికా యువకుల అరాచకం.. లోపలికి ప్రవేశించి ఫర్నీచర్ ధ్వంసం.. వీడియో వైరల్

సారాంశం

అమెరికాకు చెందిన కొందరు యవకులు చైనీస్ రెస్టారెంట్ లోకి ప్రవేశించి బీభత్సం సృష్టించారు. అక్కడున్న ఫర్నీచర్ మొత్తం ధ్వంసం చేశారు. ఆహారాన్ని, పాత్రలను విసిరేశారు. ఈ దుశ్చర్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

చైనీస్ రెస్టారెంట్ లో అమెరికా యువకులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. లోపలికి ప్రవేశించి ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. ఆహారాన్ని విసిరేశారు. సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

భారత్-ఆస్ట్రేలియా టెస్టు లొ ప్ర‌ధాని మోడీ, ఆస్ట్రేలియా పీఎం ఆంథోనీ అల్బనీస్.. !

ది న్యూయార్క్ పోస్ట్ ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ముసుగులు ధరించిన కొందరు హింసాత్మక టీనేజర్ల బృందం ఈ వీకెండ్ లో ఓ చైనీస్ రెస్టారెంట్ లోకి ప్రవేశించింది. అక్కడున్న వస్తువులన్నింటినీ ధ్వంసం చేసింది. వీరి చేష్టలకు భయభ్రాంతులకు గురైన సిబ్బంది నిస్సహాయంగా చూస్తుండిపోయారు. యువకులు ఆ సమయంలో టేబుళ్లను కిందికి పారేయడం, కుర్చీలను పగలగొట్టడం వంటివి చేశారు. 

స్థానిక సామాజిక కార్యకర్త యితిన్ చు ట్విటర్లో దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఆమె అందులో పేర్కొన్న వివరాల ప్రకారం. పోకిరీ యువకులు తిన్న ఆహారాన్ని చిందరవందరగా చేసి విడిచిపెట్టారు. తరువాత టేబుళ్లు తిప్పుతూ, కుర్చీలు విసిరారు. ఆహారాన్ని ఉంచిన పాత్రలను కూడా పగులగొట్టారు. వీరి చర్యలతో రెస్టారెంట్ మొత్తం గందరగోళంగా మారింది. వీరి చేష్టలన్నీ ఆమె షేర్ చేసిన వీడియోలో కనిపిస్తున్నాయి.

కూతుళ్ల కోసం మళ్లీ పెళ్లి చేసుకున్న ముస్లిం జంట.. విమర్శలకు ఘాటుగా రిప్లై..

వీచాట్ లో ఈ వీడియో వైరల్ అవుతోంది. ‘‘ కింగ్స్ లోని కాలేజ్ పాయింట్ లో ఉన్న ఫిష్ విలేజ్ అనే రెస్టారెంట్ పై ఈ దాడి జరిగింది. ముసుగు ధరించిన యువకుల ముఠా ఈ దుశ్చర్యకు పాల్పడింది. ప్రైవేటు ఆస్తులపై జరిగిన ఈ భయంకరమైన దాడికి పర్యవసానాలు ఉంటాయని ఆశించడం లేదు’’ అని ఏషియన్ వేవ్ అలయెన్స్ అధ్యక్షుడు, ప్లేస్ ఎన్వైసీ సహ వ్యవస్థాపకుడు చు తన పోస్టులో పేర్కొన్నారు.

13యేళ్ల బాలుడితో గర్భం దాల్చిన 31 యేళ్ల మహిళ.. కోర్టు ఏమందంటే...

అయితే ఇప్పటికే తీవ్ర నష్టం జరిగి ఆందోళనలో ఉన్న రెస్టారెంట్ సిబ్బంది.. ఈ దుండగులు మళ్లీ వచ్చి దాడి చేస్తారని భయపడుతున్నారు. ఈ ఘటనపై రెస్టారెంట్ ఉద్యోగి మాండరిన్ లో ‘ది న్యూయార్క్ పోస్ట్’తో మాట్లాడుతూ.. ‘‘ఆ సమయంలో కొంచెం భయమేసింది. ఇక్కడ సేఫ్టీ తక్కువగా ఉంది. కారణం ఏమిటో మాకు తెలియదు. ఇది చాలా బాధాకరంగా ఉంది’’ అని తెలిపారు. అయితే ఈ దాడికి పాల్పడిన యువకుల ముఠా కోసం స్థానిక పోలీసులు గాలిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

20 వేల కిలో మీట‌ర్లు, 21 రోజుల ప్ర‌యాణం.. ప్ర‌పంచంలోనే అతిపెద్ద రైలు మార్గం. ఈ ఊహ ఎంత బాగుందో..
India Oman: మోదీ మాస్ట‌ర్ ప్లాన్, ఒమాన్‌తో కీల‌క ఒప్పందం.. దీంతో మ‌న‌కు లాభం ఏంటంటే..