వారెవ్వా.. బీర్ తో నడిచే బైక్ తయారు చేసిన అమెరికా వాసి.. గంటకు 240 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుందట..

By Asianet NewsFirst Published May 12, 2023, 11:06 AM IST
Highlights

అమెరికాకు చెందిన కై మైఖేల్సన్ బీర్ తో నడిచే బైక్ ను రూపొందించి అందరినీ అబ్బురపరిచాడు. తాను బీర్ తాగనని, అయితే దానిని బైక్ ఇంధనంగా ఎందుకు ఉపయోగించకూడదనే వచ్చిన ఆలోచనే ఈ ఆవిష్కరణకు నాంది అయ్యిందని ఆయన చెప్పారు. 

మనకు కొన్నేళ్ల కిందటి వరకు పెట్రోల్ తో నడిచే బైక్ లు మాత్రమే తెలుసు. అయితే ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ బైక్ లు అందుబాటులో వచ్చాయి. అంటే పరోక్షంగా కరెంటుతోనే నడిచే బైక్ లు అన్నమాట. ఇలా పెట్రోల్, కరెంటుతో కాకుండా ఇంకా కొత్తగా ఏదో కనిబెట్టాలనుకున్నాడు ఆ అమెరికా వాసి. దానిపై రీసెర్చ్ చేసి ఏకంగా బీరుతోనే నడిచే బైక్ ను రూపొందించాడు. 

ఘోరం.. అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలన్నందుకు వృద్ధుడిని చితకబాది, మూత్రం పోసిన పక్కింటి వ్యక్తి..

తన అసాధారణ ఆవిష్కరణలతో సంచలనం సృష్టించిన అమెరికాకు చెందిన కై మైఖేల్సనే ఈ బీర్ తో నడిచే బైక్ ను తయారు చేశాడు. అతడు గతంలో రాకెట్ ఆధారిత టాయిలెట్, జెట్ ఆధారిత కాఫీ కుండను కనిబెట్టాడు. ఈ కొత్త ఆవిష్కరణలో గ్యాస్ ఆధారితంగా నడిచే ఇంజన్ కు బదులు.. హీటింగ్ కాయిల్ తో కూడిన 14 గ్యాలన్ కెగ్ అమర్చాడు. అయితే అందులో బీర్ పోయగానే.. దానిని కాయిల్ 300 డిగ్రీల వరకు వేడి చేస్తుందని, అది నాజిల్స్ లో సూపర్-హీటెడ్ ఆవిరిగా మారుతుందని కై మైఖేల్సన్ చెప్పారు. దీని వల్ల బైక్ ముందుకు కదులుతుందని పేర్కొన్నాడు. 

దారుణం.. ఇంటి నుంచి ఎత్తుకెళ్లి 13 ఏళ్ల దళిత బాలికపై సామూహిక అత్యాచారం..

ఈ బైక్ ప్రస్తుతం బ్లూమింగ్టన్ లోని అతడి గ్యారేజీలో ఉందని ‘టైమ్స్ నౌ’ నివేదించింది. ఈ బైక్ రూపకల్పనపై కై మైఖేల్సన్ మాట్లాడుతూ.. ‘‘ఈ మోటార్ సైకిల్ ఖచ్చితంగా భిన్నంగా ఉంటుంది. నేను ఎప్పుడూ సృజనాత్మకంగా ఉండటానికి ఇష్టపడతాను. మీరు కూడా గతంలో ఎన్నడూ పనులు చేయండి’’ అని ‘కే ఫాక్స్ 9’తో అన్నారు.

కాలిఫోర్నియాలో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 5.5 తీవ్రత నమోదు..

‘‘మేముండే ప్రాంతంలో అక్కడ గ్యాస్ ధర పెరుగుతోంది. అయితే నేను బీర్ తాగను. కాబట్టి బీర్ ను ఎందుకు ఇంధనంగా ఉపయోగించకూడదనే ఆలోచన నాకు వచ్చింది. కాబట్టి నేను ఆ విషయంపై బాగా ఆలోచించాను. తరువాత ఎంతో కష్టపడి ఈ బైక్ ను రూపొందించాను. ’’ అని తెలిపారు. 

ట్విట్టర్ కు మహిళా సారథిని కనుగొన్నాని ప్రకటించిన ఎలన్ మస్క్.. 6 వారాల్లో నియామకం జరుగుతుందని ట్వీట్..

కాగా.. రాకెట్ మ్యాన్ అని ముద్దుగా పిలుచుకునే కేయ్.. తన బైక్ ను ఇప్పటి వరకు రోడ్డుపైకి తీసుకురాలేదు. కానీ బీర్ తో నడిచే ఈ వాహనం కొన్ని లోకల్ కార్ షోలలో చోటు దక్కించుకుంది అక్కడ ఇది మొదటి స్థానాన్ని గెలుచుకుంటోంది. ఈ బైక్ గంటకు 150 మైళ్ల (గంటకు 240 కిలోమీటర్లు) వేగంతో దూసుకెళ్లగలదని ఆయన చెప్పారు. త్వరలోనే ఈ బైక్ ను డ్రాగ్ స్ట్రిప్ లోకి తీసుకెళ్లి దాని సామర్థ్యాలను పరీక్షించాలని తాను చూస్తున్నాని పేర్కొన్నారు. 
 

click me!