కాలిఫోర్నియాలో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 5.5 తీవ్రత నమోదు..

By Asianet NewsFirst Published May 12, 2023, 9:30 AM IST
Highlights

కాలిఫోర్నియాలో శుక్రవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 5.5గా నమోదయ్యిందని, భూకంప లోతు 1.5 కిలో మీటర్లుగా ఉందని యుఎస్ జీఎస్ ప్రకటించింది. 

అమెరికాలోని కాలిఫోర్నియాలో శుక్రవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దాని తీవ్రత 5.5గా నమోదు అయ్యింది. ఈస్ట్ షోర్ కు నైరుతి దిశలో 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలిఫోర్నియాలో ఈ భూకంప కేంద్రం ఉందని, దాని లోతు 1.5 కిలోమీటర్లుగా ఉందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యుఎస్ జీఎస్) తెలిపింది.

United States | An earthquake of magnitude 5.5 occurred 4 km southwest of East Shore in California. The depth of the earthquake was 1.5 km: USGS

(Photo: USGS) pic.twitter.com/NhxyC5CKkM

— ANI (@ANI)

అయితే ఈ భూకంపం వల్ల ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టమూ సంభవించలేదని పేర్కొంది. కాగా.. గురువారం జపాన్ రాజధాని టోక్యో, పరిసర ప్రాంతాల్లో 5.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో పలువురికి గాయాలు అయ్యాయి. టోక్యోకు ఆగ్నేయంగా ఉన్న చిబా ప్రిఫెక్చర్ లో భూకంప కేంద్రం ఉన్నట్లు జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు.

దారుణం.. ఇంటి నుంచి ఎత్తుకెళ్లి 13 ఏళ్ల దళిత బాలికపై సామూహిక అత్యాచారం..

ఇదిలా ఉండగా... భారత్ లోని జమ్మూ కాశ్మీర్ లో ఏప్రిల్ 30వ తేదీన భూకంపం వచ్చింది. గత ఆదివారం 4.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. ఉదయం 5.15 గంటలకు వచ్చిన ఈ భూకంపం 5 కిలోమీటర్ల లోతులో ఉందని పేర్కొంది. అక్షాంశం-రేఖాంశాలు వరుసగా 35.06, 74.49గా నివేదించబడ్డాయి. భూకంపం తీవ్రత 4.1 గా రిక్ట‌ర్ స్కేల్ పై న‌మోదైంది. ఐదు కిలో మీట‌ర్ల లోతులో ఈ భూకంపం సంభ‌వించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ఒక ట్వీట్‌లో పేర్కొంది.

ట్విట్టర్ కు మహిళా సారథిని కనుగొన్నాని ప్రకటించిన ఎలన్ మస్క్.. 6 వారాల్లో నియామకం జరుగుతుందని ట్వీట్..

అయితే ఈ ప్రాంతం అధిక భూకంప జోన్ల‌లో ఉన్నందున.. వరద నష్టాలు ఎక్కువ‌గా ఉండ‌టంతో పాటు ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడానికి మొత్తం 20 జిల్లాల్లో అత్యాధునిక అత్యవసర ఆపరేషన్ సెంటర్లను (ఈవోసీ) ఏర్పాటు చేయాలని జమ్మూ కాశ్మీర్ పరిపాలన యంత్రాంగం నిర్ణయించింది.

click me!