సముద్రంలో కుప్పకూలిన అమెరికన్ ఆర్మీ హెలికాప్టర్.. ఐదుగురు స్పెషల్ ఆపరేషన్ సైనికులు మృతి..

By SumaBala Bukka  |  First Published Nov 13, 2023, 7:00 AM IST

సైప్రస్ తీరంలో విమానం కూలిపోయినప్పుడు సైనికులు ఇంధనం నింపుకునే శిక్షణా మిషన్‌లో ఉన్నారు. ఈ ప్రమాదానికి కారణాలను ప్రస్తుతం అన్వేషిస్తున్నారు.


అమెరికా : తూర్పు మధ్యధరా సముద్రంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఐదుగురు యుఎస్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్స్ బలగాలు మరణించినట్లు అమెరికా అధికారులు ఆదివారం తెలిపారు. సైనికులు MH-60 బ్లాక్ హాక్ హెలికాప్టర్‌లోని సిబ్బంది. శుక్రవారం ఈ హెలికాప్టర్ రీఫ్యూయలింగ్ శిక్షణా మిషన్‌లో ఉంది, విమానం సైప్రస్ తీరంలో కూలిపోయింది. ఈ ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతోందని దీనిమీద పనిచేస్తున్న ముగ్గురు యూఎస్ అధికారులు తెలిపారు. 

ఇజ్రాయెల్-హమాస్ ల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రాంతీయంగా విస్తరించకుండే ఉండేందుకు అమెరికా మధ్యదరా ప్రాంతంలో ఓ ఆర్మీ బృందాన్ని మోహరించింది. ప్రతీరోజూ ఈ బృందానికి శిక్షణా కార్యక్రమాలు ఉంటాయి. అవసరం పడితే ఈ ప్రాంతంలో అమెరికన్ పౌరులను ఖాళీ చేయడంలో సహాయం చేయడానికి, వారికి అండగా ఉండడానికి వీటిని వాడుతుంది. రోజువారీ సైనిక శిక్షణలో భాగంగానే నవంబర్ 10న బయల్దేరిన హెలికాప్టర్, సమస్యలు తలెత్తడంతో కుప్పకూలింది.

Latest Videos

undefined

Plane crashes into car : కారును ఢీకొట్టిన విమానం.. వీడియో వైరల్..

మరణించిన హెలికాప్టర్ సిబ్బంది ఆర్మీ ఎలైట్ 160వ స్పెషల్ ఆపరేషన్స్ ఏవియేషన్ రెజిమెంట్‌లో సభ్యులు. దీనిని నైట్ స్టాకర్స్ అని పిలుస్తారు. రహస్య మిషన్లలో కమాండోలను రవాణా చేయడానికి నియమించబడిన ఏవియేటర్లలో ఉన్నారు. ఒక అమెరికన్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్, గెరాల్డ్ ఆర్. ఫోర్డ్, ఇజ్రాయెల్ తీరంలో తూర్పు మధ్యధరా ప్రాంతంలో కూడా పనిచేస్తోంది.

ఆదివారం ఒక ప్రకటనలో, మిలిటరీ యూరోపియన్ కమాండ్ ఐదుగురు కమాండోల మరణాలను "ఒక సాధారణ గాలి ఇంధనం నింపే మిషన్" అని అంగీకరించింది. డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ జే. ఆస్టిన్ III ఆదివారం ఒక ప్రకటనలో, "మధ్యధరా సముద్రంలో శిక్షణా హెలికాప్టర్ ప్రమాదంలో ఐదుగురు యూఎస్ సర్వీస్ సభ్యుల విషాదకరమైన నష్టానికి సంతాపం తెలియజేస్తున్నాం" అన్నారు. 

ప్రెసిడెంట్ బిడెన్, దీనిమీద సంతాపం తెలుపుతూ... “మా సేవా సభ్యులు ప్రతిరోజూ మన దేశం కోసం తమ జీవితాలను ఫణంగా పెడుతున్నారు. అమెరికన్ ప్రజలను సురక్షితంగా ఉంచడానికి వారు ఇష్టపూర్వకంగా రిస్క్ తీసుకుంటారు’ అన్నారు. 

click me!