
Justin Trudeau : ఖలిస్తాన్ అనుకూల నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత హస్తం ఉందన్న తన ఆరోపణను కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పునరుద్ఘాటించారు. ఈ తీవ్రమైన అంశానికి తార్కిక ముగింపు వెతికేందుకు భారతదేశంతో నిర్మాణాత్మకంగా పనిచేయాలని తమ దేశం కోరుకుంటోందని స్పష్టం చేశారు.
కల్తీ మద్యం తాగి 18 మంది మృతి.. ఏడుగురిని అరెస్టు చేసిన పోలీసులు.. ఎక్కడంటే ?
సిక్కు వేర్పాటువాద నాయకుడి హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్లు పాల్గొని ఉంటారని నమ్మడానికి తమ దేశానికి చాలా తీవ్రమైన కారణాలు ఉన్నాయని కెనడా ప్రధాని తెలిపారు. ‘‘ఈ తీవ్రమైన అంశంపై భారత్ తో నిర్మాణాత్మకంగా పనిచేయాలనుకుంటున్నట్లు స్పష్టం చేశాం. మొదటి నుండి మేము తీవ్రంగా ఆందోళన చెందుతున్న నిజమైన ఆరోపణలను పంచుకున్నాం. దీనిని తీవ్రంగా పరిగణించడానికి మేము భారత ప్రభుత్వాన్ని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాగస్వాములను సంప్రదించాము’’ అని ట్రూడో తెలిపారు.
Fire in Dal Lake : కాశ్మీర్ లోని దాల్ సరస్సులో అగ్నిప్రమాదం.. ముగ్గురు బంగ్లాదేశీ పర్యాటకులు మృతి
దేశంలోని 40 మంది కెనడియన్ దౌత్యవేత్తల అధికారలను తొలగించడం తననను నిరాశకు గురి చేసిందని కెనడా ప్రధాని అన్నారు. వియన్నా ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘించిందని, భారత్ లోని 40 మందికి పైగా కెనడా దౌత్యవేత్తలకు దౌత్యపరమైన మినహాయింపును ఏకపక్షంగా రద్దు చేసిందని ఆరోపించారు. ‘‘కెనడా గడ్డపై కెనడా పౌరుడి హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్లు ప్రమేయం ఉందని నమ్మడానికి మాకు తీవ్రమైన కారణాలు ఉన్నాయి. వియన్నా ఒప్పందం ప్రకారం వారి హక్కులను ఉల్లంఘించడం ద్వారా మొత్తం కెనడియన్ దౌత్యవేత్తల సమూహాన్ని తరిమికొట్టడమే భారతదేశం ప్రతిస్పందన’’ అని ఆయన పేర్కొన్నారు.
tunnel collapses : కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న సొరంగం.. చిక్కుకుపోయిన 36 మంది కార్మికులు..
ఇది ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగించే విషయమని, ఎందుకంటే ఒక దేశం మరో దేశానికి చెందిన తమ దౌత్యవేత్తలకు ఇక రక్షణ లేదని నిర్ణయించగలిగితే, అది అంతర్జాతీయ సంబంధాలను మరింత ప్రమాదకరంగా, మరింత తీవ్రంగా మారుస్తుందని ట్రూడో అన్నారు. కానీ అడుగడుగునా భారత్ తో నిర్మాణాత్మకంగా, సానుకూలంగా పనిచేయడానికి ప్రయత్నించామని, భారత ప్రభుత్వ దౌత్యవేత్తలతో కలిసి పనిచేయడం కొనసాగిస్తామని తెలిపారు. అయితే తాము పోరాటం చేయాలనుకోవడం లేదని, కానీ చట్టబద్ద పాలన కోసం తాము ఎప్పుడూ నిలబడతామని ఆయన చెప్పారు.