ఇజ్రాయెల్-హమాస్ యుద్దం.. యూఎన్‌లో ఆ తీర్మానానికి అనుకూలంగా భారత్ ఓటు..

By Sumanth Kanukula  |  First Published Nov 12, 2023, 1:46 PM IST

ఇజ్రాయెల్-హమాస్ యుద్దం నెలరోజులకు పైగా కొనసాగుతుంది. గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఐకరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన ఓ తీర్మానం విషయంలో భారతదేశం కీలక నిర్ణయం తీసుకుంది. 


ఇజ్రాయెల్-హమాస్ యుద్దం నెలరోజులకు పైగా కొనసాగుతుంది. గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఐకరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన ఓ తీర్మానం విషయంలో భారతదేశం కీలక నిర్ణయం తీసుకుంది. పాలస్తీనాలో ఇజ్రాయెల్ సెటిల్మెంట్లకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో గురువారం (నవంబర్ 9) ఒక ముఖ్యమైన తీర్మానం ప్రవేశపెట్టగా.. ఈ తీర్మానానికి భారత్ అనుకూలంగా ఓటు వేసింది.  మొత్తంగా ఈ తీర్మానానికి 145 దేశాలు మద్దతుగా ఓటు వేశాయి. దీంతో ఆ తీర్మానం ఆమోదం పొందింది.

ఐక్యరాజ్యసమితిలో ఉంచిన ఈ తీర్మానంలో.. తూర్పు జెరూసలేం, ఆక్రమిత సిరియన్ గోలన్‌తో సహా పాలస్తీనా భూభాగాలలో ఇజ్రాయెల్ చర్యలు విమర్శించబడ్డాయి. తూర్పు జెరూసలేం, ఆక్రమిత సిరియన్ గోలాన్‌తో సహా పాలస్తీనా భూభాగాల్లో ఇజ్రాయెల్ సెటిల్‌మెంట్లను ఖండిస్తూ ఈ తీర్మానం చేశారు. 145 దేశాలు అనుకూలంగా ఓటు వేయడం ఈ తీర్మానం ఆమోదం పొందింది. 

Latest Videos

undefined

అయితే ఈ తీర్మానాన్ని ఏడు దేశాలు వ్యతిరేకించాయి. అందులో కెనడా, హంగరీ, ఇజ్రాయెల్, మార్షల్ దీవులు, ఫెడరేటెడ్ స్టేట్స్ ఆఫ్ మైక్రోనేషియా, నౌరు, అమెరికా ఉన్నాయి. మరోవైపు 18 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ఇదిలాఉంటే, కొద్ది రోజుల క్రితం.. ఇజ్రాయెల్‌-హమాస్‌ యద్ధాన్ని తక్షణమే ఆపేయాలని కోరుతూ జోర్డాన్‌ ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్‌కు భారత్‌ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఓటింగ్‌కు దూరంగా ఉండటంపై స్పందిస్తూ.. గాజాలో విస్తరిస్తున్న మానవతా సంక్షోభంపై భారతదేశం ఆందోళన చెందుతోందని.. ఉగ్రవాదాన్ని వ్యతిరేకించడంపై ఎలాంటి సందేహం ఉండదని  కూడా విశ్వసిస్తున్నట్లు భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇక, తాజాగా ఇజ్రాయెల్‌ అంశంతో మరోసారి భారత్ ఆచితూచి వ్యవహరించింది. 

అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై జరిగిన దాడులతో ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్దం ప్రారంభమైంది. ఈ యుద్దంలో 11,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. హమాస్ దాడుల్లో దాదాపు 1,200 మంది ఇజ్రాయిలీలు మరణించగా.. 200 మందికి పైగా బందీలుగా ఉన్నట్టుగా నివేదికలు చెబుతున్నాయి. 
 

click me!