కెనడాలోని బ్రాంప్టన్ కౌన్సిలర్ గా భారత సంతతికి చెందిన సిక్కు మహిళ ఎంపిక.. ఇంతకీ ఏవరామే ? ఏమిటీ ప్రత్యేకతలు..

By team teluguFirst Published Oct 27, 2022, 9:57 AM IST
Highlights

భారత సంతతికి చెందిన వ్యక్తులు విదేశాల్లో ప్రజా ప్రతినిధులుగా ఎన్నికవుతున్నారు. ఇటీవల బ్రిటన్ ప్రధానిగా రిషి సునక్ బాధ్యతలు స్వీకరించారు. తాజాగా నవజిత్ కౌర్ బ్రార్ అనే మహిళ కెనడాలోని బ్రాంప్టన్ నగరానికి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. 

భారత సంతతికి చెందిన కెనడా ఆరోగ్య కార్యకర్త నవజిత్ కౌర్ బ్రార్ కెనడాలోని బ్రాంప్టన్ నగరానికి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. దీంతో తలపాగా ధరించిన తొలి సిక్కు మహిళా కౌన్సిలర్‌గా ఆమె రికార్డు సృష్టించారు. బ్రార్ శ్వాసకోశ వైద్య నిపుణురాలిగా పని చేస్తున్నారు. ఆమె బ్రాంప్టన్ లోని 2,6 వార్డులను గెలుచుకున్నారు. ముగ్గురు పిల్లల తల్లి అయిన నవజీత్, బ్రాంప్టన్ వెస్ట్ నుంచి కన్జర్వేటివ్ పార్టీ టికెట్‌పై పోటీ చేసిన మాజీ పార్లమెంటేరియన్ జెర్మైన్ ఛాంబర్స్‌పై విజయం సాధించారు. 

రంగంలోకి దిగిన కాంగ్రెస్ కొత్త చీఫ్ ఖర్గే.. 47 మందితో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు.. శశి థరూర్ కు దక్కని చోటు

ఈ ఎన్నికల్లో నవజిత్ కౌర్ బ్రార్ కు 28.85 శాతం ఓట్లు వచ్చాయి. ఆమెపై పోటీకి దిగిన ఛాంబర్స్‌కు 22.59 శాతం, కార్మెన్ విల్సన్‌కు 15.41 శాతం ఓట్లు వచ్చాయని గార్డియన్ నివేదించింది. ఆమె గతంలో బ్రాంప్టన్ వెస్ట్, అంటారియో నుండి ఎన్డీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ ఆమె ప్రస్తుత ప్రోగ్రెసివ్ కన్జర్వేటివ్ ఎంపీపీ నాయకుడు అమర్‌జోత్ సంధు చేతిలో ఆ సమయంలో ఓడిపోయారు. అయితే ఈ సారి తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె గడిచిన రెండు నెలల్లో 40,000 మందికి పైగా ప్రజలను కలిశారు. 22,500 మందికి పైగా నివాసితులతో మాట్లాడారు. కొత్తగా మౌలిక సదుపాయాలను కల్పించడం, నేరాలను తగ్గించడం, రహదారి భద్రతను మెరుగుపరచడం వంటి అంశాలపై తాను ప్రధానంగా దృష్టి సారిస్తానని ఆమె తన ప్రచారంలో హామీ ఇచ్చారు.

‘మా నాన్న 30 ఏళ్లలో 70మంది మహిళలను హత్య చేశాడు.. పూడ్చేందుకు మేము సాయం చేసేవాళ్లం..’

ఇటీవలి ఎన్నికల్లో రెండోసారి గెలిచిన బ్రాంప్టన్ మేయర్ ప్యాట్రిక్ బ్రౌన్.. నవజిత్ కౌర్ బ్రార్‌కు తన అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. బ్రార్ ఎన్నిక పట్ల తాను గర్వపడుతున్నానని చెప్పారు. కరోనా మహమ్మారి సమయంలో ఆమె నిస్వార్థంగా, అంకితభావంతో ముందుండి పని చేశారని కొనియాడారు. ఆమె ఇప్పుడు ప్రజలకు సేవ చేయడంలో పెద్ద అడుగు వేసిందని పేర్కొన్నారు. బ్రాంప్టన్ సిటీ కౌన్సిల్ కోసం ఆమె అద్భుతంగా పని చేస్తారని తాను ఖచ్చితంగా భావిస్తున్నానని తెలిపారు. 

ప్రతీ నాలుగు సంవత్సరాలకు ఒక సారి అక్టోబర్ నెలలో వచ్చే నాలుగో సోమవారం అక్కడి ప్రభుత్వం పౌర ఎన్నికలు  నిర్వహిస్తుంటుంది. అయితే ఈసారి అక్టోబర్ 24వ తేదీన ఎన్నికల వచ్చాయి. దీపావళి సమయంలో ఎన్నికల తేదీని ప్రకటించడంతో కౌన్సిలర్ అభ్యర్థులతో పాటు భారతీయ-కెనడియన్ కమ్యూనిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కాగా.. బ్రాంప్టన్ పౌర ఎన్నికల్లో 40 మంది పంజాబీలు పోటీలో నిలిచారని స్థానిక మీడియా నివేదించింది. అక్కడ 354,884 మంది అర్హులైన ఓటర్లలో 87,155 మంది మాత్రమే ఓటు వేశారు.

యుద్ధంలో 400 కమికేజ్ డ్రోన్ల వినియోగం.. రష్యాపై జెలెన్స్కీ విమర్శలు

ఈ ఎన్నికల్లో గెలుపొందడంపై బ్రార్ మాట్లాడుతూ.. ‘‘నాకు రాజకీయ అనుభవం చాలా తక్కువ. కానీ శ్వాసకోశ చికిత్సకుడిగా నేను చాలా మంది వ్యక్తులతో పనిచేశాను. కాబట్టి నేను వారి అంచనాలను అందుకుంటాను. కొత్త మౌలిక సదుపాయాలను నిర్మించడం, నేరాలను తగ్గించడం, రహదారి భద్రతను మెరుగుపరచడం వంటి మూడు రంగాలపై ఆమె దృష్టి సారిస్తాను’’ అని ఆమె తెలిపారు. 

click me!