‘మా నాన్న 30 ఏళ్లలో 70మంది మహిళలను హత్య చేశాడు.. పూడ్చేందుకు మేము సాయం చేసేవాళ్లం..’

By SumaBala BukkaFirst Published Oct 27, 2022, 8:08 AM IST
Highlights

అమెరికాలో ఓ సీరియల్ కిల్లర్ ఉదంతం ఇప్పుడు కలకలం రేపుతోంది. తన తండ్రి 30 యేళ్లలో దాదాపు 70మంది మహిళలను హత్య చేశాడని ఓ మహిళ చెప్పుకొచ్చింది. 

వాషింగ్టన్ : అమెరికాలోని అయోవా, జెఫ్రీ డహ్మెర్, టెడ్ బండీ వంటి నరహంతకులు పోటీగా మరో హర్రర్ స్టోరీ వెలుగులోకి వచ్చింది. తన తండ్రి 30యేళ్లలో సుమారు 70మంది మహిళలను హత్యచేసినట్లు ఓ మహిళ వెల్లడించడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఆ మహిళల  మృతదేహాలను పూడ్చిపెట్టేందుకు తాను, తన సోదరులు సహాయపడేవారమని లూసీస్టడీ అనే మహిళ న్యూస్ వీక్ ఇంటర్వ్యూలో తెలిపింది. ఆ మృతదేహాలను  ఎక్కడ పాతిపెట్టారో  తనకు తెలుసునని చెప్పడం గమనార్హం.  

ఈ క్రమంలో ఆమె తెలిపిన ప్రాంతాల్లో పోలీసులు, డాగ్స్ మానవ అవశేషాలను గుర్తించినట్లు న్యూస్ వీక్ తెలిపింది. నిందితుడు  డోనాల్డ్ డీన్ స్టడీ 75 ఏళ్ళ వయసులో 2013లో మరణించాడు,  తాజాగా ఆ కిరాతకుడు చేసిన హత్యలను అతని కూతురు బయటపెట్టడం సంచలనంగా మారింది. మహిళను హత్య చేసి.. వారి మృతదేహాలనుసమీపంలోని బావి లేదా కొండ ప్రాంతంలోకి తీసుకు వెళ్లేందుకు తన పిల్లల సహాయం తీసుకునేవాడు. మృతదేహాలను తీసుకువెళ్లేందుకు తాము తోపుడు బండి లేదా టోబోగన్ లను  ఉపయోగించేవారమని నిందితుడి కూతురు వెల్లడించింది. 

అమెరికా మాజీ డిఫెన్స్ సెక్రటరీ మృతి పట్ల విదేశాంగ మంత్రి సంతాపం

బావిలో పడేశాక వాటిపై మట్టిపోసేవారిమని చెప్పింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. చాలామంది బాధితులను సమీపంలోని వంద అడుగుల లోతైన బావిలో పడేశారు. వారికి ఉన్న బంగారం దంతాలను ట్రోఫీలుగా భావించి వాటిని తన తండ్రి  దాచుకునేవాడు అని చెప్పింది. మహిళ లూసీ స్టడీ తన తండ్రిపై ఆరోపణలు చేసిన క్రమంలో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. స్నిప్పర్ డాగ్స్ తో ఆమె చెప్పిన బావి వద్ద సోదాలు చేపట్టినట్లు  తెలిపారు. 
అయితే, ప్రస్తుతం మనుషులకు సంబంధించిన ఒక్క ఎముక సైతం కనిపించలేదని, కానీ శునకాల ప్రవర్తన బట్టి ఇది పెద్ద స్మశాన వాటికలా ఉందని తెలిపారు. నిందితుడు  డోనాల్డ్  స్టడీ.. సెక్స్ వర్కర్లు, ఒమహా, నెబ్రస్కా ప్రాంతాల నుంచి మహిళలను మోసగించి తన ఐదు ఎకరాల విస్తీర్ణంలోని వ్యవసాయ క్షేత్రంలోకి తీసుకు వచ్చి హత్య చేసి ఉంటాడని అధికారులు భావిస్తున్నారు.

అమెరికా చరిత్రలోనే…
లూసీ స్టడీ చేసిన ఆరోపణలు నిజమని తేలితే అమెరికా చరిత్రలోనే అతిపెద్ద సీరియల్ కిల్లర్ గా డోనాల్డ్  స్టడీ నిలువనున్నాడని  అధికారులు తెలిపారు. జెఫ్పెరి డహ్మెర్ 17 మందిని హత్య చేశాడు.  అలాగే టెడ్ బండీ అనే కిరాతకుడు 36 మందిని పొట్టన పెట్టుకున్నాడు. మరోవైపు.. బావిలో పడేసిన బాధితులు అందరిని తీసి సరైన రీతిలో తిరిగి అంత్యక్రియలు నిర్వహించాలనే కారణంగానే తాను ఈ విషయాలను బయటపెట్టినట్లు లూసీ స్టడీ చెప్పింది.

click me!