16 ఏళ్ల అమ్మాయిని పెళ్లాడిన 65 ఏళ్ల మేయర్.. వెంటనే అత్తకు ప్రమోషన్..

By Asianet NewsFirst Published May 1, 2023, 7:02 AM IST
Highlights

65 ఏళ్ల మేయర్ 16 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచాడు. పెళ్లి జరిగిన మరుసటి రోజు కొత్త అత్తకు ప్రమోషన్ ఇచ్చాడు. దీనిపై ఆందోళన వ్యక్తం కావడంతో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. 

అతడో మేయర్. వయస్సు 65 ఏళ్లు. అప్పటికే రెండు పెళ్లిళ్లు జరిగాయి. ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చాడు. మూడో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఆ లేటు వయస్సుల్లో 16 ఏళ్ల యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వెను వెంటనే కొత్త అత్తకు పెద్ద ప్రమేషన్ ఇచ్చాడు. కథ ఇంతటితో ఆగలేదు. అత్తకు ప్రమోషన్ ఇవ్వడంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. దీంతో పెద్ద దుమారం రేగింది. దీంతో అధికారులు ఈ విషయంలో దర్యాప్తు ప్రారంభించాయి. 

ఇట్ల కూడా అడుగుతరా ? ఇంటి కిరాయికి ఇంటర్ మార్కులకు లింక్.. 76 శాతమే వచ్చాయని గది ఇవ్వని ఓనర్.. చాట్ వైరల్

65 ఏళ్ల బ్రెజిల్ లోని పరానా రాష్ట్రం అరౌకారియా మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ హిస్సామ్ హుస్సేన్ దేహైనీ 16 ఏళ్ల ‘ప్రిన్సెస్’ అందాల రాణిని పెళ్లి చేసుకున్నాడు. వెంటనే ఆమె తల్లికి పదోన్నతి కల్పించాడు. అతడు వివాహమాడిన యువతి పేరు కౌనే రోడ్ కమర్గో. ఉన్నత పాఠశాల విద్యార్థి అయిన ఆమె.. గతేడాది మిస్ అరౌకారియా పోటీలో టీన్ విభాగంలో పాల్గొని రెండో స్థానంలో నిలిచింది. దీంతో ఆమెకు ‘టీన్ ప్రిన్సెస్’ అవార్డు లభించింది. 

పోలీసులు వెంబడిస్తున్నారని భవనంపై నుంచి దూకి వ్యక్తి మృతి.. ఎక్కడ జరిగిందంటే ?

మేయర్ హిస్సామ్, కౌనే రోడ్ కమర్గో మొదటిసారిగా ఓ సామాజిక కార్యక్రమంలో కలుసుకున్నారు. తరువాత వారి మధ్య ప్రేమ చిగురించింది. దీంతో వారిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. బ్రెజిల్ ఉన్న చట్టాల ప్రకారం 16 ఏళ్ల దాటిన బాలికలను తల్లిదండ్రుల పర్మిషన్ తో ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు. అయితే అతడు రెండో సారి అదే నగరానికి మేయర్ గా కొనసాగుతున్నాడని, రెండో భార్యకు కొంత కాలం కిందట విడాకులు ఇచ్చాడని నివేదికలు చెబుతున్నాయి. 

ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ముస్కాన్ నారంగ్ సూసైడ్.. ఇదే నా చివరి వీడియో అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో అంతకు ముందే పోస్ట్

ఏప్రిల్ 12వ తేదీన ఈ జంటకు వివాహం జరిగింది. మరుసటి రోజే కౌనే తల్లి మారిలీన్ రోడ్ అరౌకారియా కల్చరర్ సెక్రటరీగా ప్రమోషన్ పొందారు. ఆమె అంతకు ముందు జనరల్ సెక్రటరీగా పని చేసేవారు. మారిలీన్ సోదరి ఎలిజాంజెలా రోడ్ కూడా సిటీ హాల్‌లో కమిషనర్‌గా పని చేస్తున్నారు. అయితే కొత్త అత్తగారికి ప్రమోషన్ ఇవ్వడం పట్ల అక్కడ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ప్రతిపక్ష సభ్యులు దీనిపై ప్రశ్నలు సంధించడంతో అధికారులు రంగంలోకి దిగారు. దీనిపై దర్యాప్తు చేపట్టారు. 

click me!