రోబో ద్వారా భోజనం సరఫరా: సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో

By narsimha lode  |  First Published Mar 10, 2024, 10:40 AM IST

చైనాలో  హోటళ్లలో రోబో ద్వారా ఆహారం సరఫరా  సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


బీజింగ్:టెక్నాలజీని వినియోగించుకొని  పనులు చేయడంలో  చైనా ముందుంటుంది.  హోటల్ లో బస చేసేవారికి రోబో ద్వారా  భోజనం సరఫరా చేస్తున్నారు.ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి  సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

also read:టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తు: పదేళ్ల తర్వాత మూడు పార్టీల మధ్య పొత్తు పొడుపు

Latest Videos

undefined

కెన్ అబ్రాడ్ అనే ట్రావెల్  వ్లాగర్  ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో  అప్ లోడ్ చేశారు. ఫోన్ రింగ్ కావడంతో  వీడియో ప్రారంభం కానుంది.  రోబో ఇక్కడ ఉందని  చైనీస్ భాషలో  వాయిస్ విన్పిస్తుంది.తాను బస చేసిన హోటల్ గది తలుపును కెన్ బ్రాడ్ తలుపు తెరిచాడు.  గదికి ఎదురుగా రోబో కన్పించింది.  

also read:న్యూఢిల్లీలో బోరు బావిలో పడిన చిన్నారి: సహాయక చర్యలు ప్రారంభం

రోబో మెషీన్ పై ఓపెన్ అనే బటన్ నొక్కాడు. దీంతో రోబో పై భాగం తెరుచుకుంది. అక్కడ  పుడ్ ప్యాకెట్ కన్పించింది. ఈ ఫుడ్ ప్యాకెట్ ను అతను తీసుకున్నాడు. రోబో మెషీన్ కంపార్ట్ మెంట్ ను మూసివేయడానికి క్లోజ్ బటన్ ను నొక్కాడు. ఈ కంపార్ట్ మెంట్ మూసుకుపోయింది.

also read:అత్యవసర సమయాల్లో కాపాడే బ్లూటూత్ జుంకాలు:ఎలా పనిచేస్తాయంటే?

ఆ తర్వాత రోబో అక్కడి నుండి వెళ్లిపోతుంది.  రోబో ద్వారా ఫుడ్ డెలివరీ చాలా బాగుందని ఆయన వ్యాఖ్యానించారు.  పుడ్ డెలీవరీ చేసినందుకు గాను  ధన్యవాదాలు చెప్పారు కెన్ బ్రాడ్.

 

2014లో  చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ రోబో విప్లవం కోసం పిలుపునిచ్చారు.  అప్పటి నుండి దేశంలో మనుషులు చేసే పనుల్లో ఎక్కువ శాతం రోబోలు చేస్తున్నాయి.  కరోనా సమయంలో  రోబోలపైనే ఎక్కువగా చైనా ఆధారపడింది.  

also read:టేకాఫైన కొద్దిసేపటికే నిద్రపోయిన పైలెట్లు:దారితప్పిన విమానం

2050లలో మన జీవితం ఎలా ఉంటుందోననిపిస్తుందని  ఈ వీడియోను చూసిన ఒకరు వ్యాఖ్యానించారు.  చాలా అంశాల్లో చైనా చాలా ముందుంది. కెన్ లాంటి వ్యక్తులు అక్కడ ప్రయాణించి అది ఎలా ఉంటుందో  మనకు చూపించారని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు.

also read:మిస్ వరల్డ్ 2024: చెక్ రిపబ్లిక్ కు చెందిన క్రిస్టినా పిస్కోవాకు కిరీటం

కస్టమర్లకు చాలా సౌకర్యంగా ఉంటుందని మరొకరు వ్యాఖ్యానించారు.చైనాలో ఇప్పుడు ఇది సర్వసాధారణం, ఇక్కడ మీ పర్యటనను ఆనందించండి అని మరొక నెటిజన్ చెప్పారు.కరోనా మహమ్మారి సమయంలో రోబోల పరిచయం ప్రారంభమైంది.  చైనీస్ హోటళ్లలో  రోబోల వాడకంతో ప్రసిద్ది చెందాయని  మరొక నెటిజన్ అభిప్రాయపడ్డారు.
 

click me!