JD Vance Visits India: అమెరికా అధ్యక్షుడు జేడీ వాన్స్ ఇండియాకు చేరుకున్నాడు. ఈరోజు ఉదయం 10 గంటలకు జేడీ వాన్స్ తన సతీమణి ఉషాతో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీ, అమిత్ షా, తదితర నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇటీవల ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, సుంకాలు, టారిఫ్‌లు, ఆర్థిక, వాణిజ్యం, భౌగోళిక సంబంధాలపై జేడీతో మోదీ చర్చించే అవకాశం ఉంది. ఈ చర్చలతో రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంది. అయితే.. జేడీ వ్యాన్స్ భార్య ఉషా తెలుగమ్యాయి.. ఈ వార్త ఇప్పుడు వైరల్‌గా మారుతోంది.
ఉషావాన్స్ కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా సాయిపురంలో ఉండటం విశేషం.. ఉషా తల్లిదండ్రులు 1970లో అమెరికాకు వెళ్లిపోయారు. దీంతో అమెరికా రిపబ్లిక్ పార్టీ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలుగింటి అల్లడు కావడం ప్రత్యేకంగా చెప్పవచ్చు. వాన్స్ భార్య ఉష తెలుగు సంతతికి చెందిన అమ్మాయి.. ఉషా చిలుకూరిది విశాఖ వాసులకు బంధువు అంట.. గతేడాది వరకూ విశాఖలో సుపరిచిత సెంచూరియన్, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేసిన శాంతమ్మ మనుమరాలే ఉషా. ఈ నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి జేడీ వాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయన భార్య ఉషా పేరు ఊరు గురించి వెలుగులోకి వచ్చాయి.
చిలుకూరి ఉష వాన్స్‌కు వైజాగ్, కృష్ణా జిల్లాలో బంధువులు ఉన్నారు. మరి ఇండియా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో వాన్స్ దంపతులు తెలుగు రాష్ట్రాలను కూడా సందర్శిస్తారా లేదా అన్నది ఆసక్తిగా మారింది. ఇక జేడీ వాన్స్‌ను అమెరికా ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కావడంపై శాంతమ్మ హ్యాపీగా ఉన్నారు. ఉష తల్లిదండ్రులు ఎప్పుడో అమెరికాలో స్థిరపడ్డారని.. ఉష కూడా అమెరికాలో పుట్టి పెరగడంతో తనకు అంతగా పరిచయం లేదని శాంతమ్మ చెబుతున్నారు. వాన్స్ గెలిచిన తర్వాత ఫోన్‌లో ఉష తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడి అభినందనలు తెలిపినట్లు శాంతమ్మ చెబుతున్నారు. ఇక చెన్నైలో డాక్టర్‌గా పనిచేస్తున్న ఉష మేనత్త శారద ఉష, వాన్స్ వివాహానికి సైతం హాజరైనట్లు ఆమె అంటున్నారు. తమ బంధువులు చాలామంది అమెరికాలో స్థిరపడ్డారని అంటున్నారు శాంతమ్మ.
ఇక కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం సాయిపురం గ్రామం ఉషా చిలుకూరి పూర్వీకులు ఉండేవారు. ఉషకు తాత వరుస అయ్యే రామ్మోహనరావు కుటుంబం ప్రస్తుతం ఇక్కడే నివాసం ఉంటుండగా వారి వంశవృక్ష పటం లభించింది. ఉష పూర్వీకులు దశాబ్దాల కిందటే ఇతర ప్రాంతాలకు వెళ్లిపోగా సాయిపురంలో 18వ శతాబ్దంలో చిలుకూరి బుచ్చిపాపయ్య శాస్త్రి నివసించారు. ఆయన సంతానమే శాఖోపశాఖలుగా ఉష వరకు విస్తరించింది. ఆమె ముత్తాత వీరావధాన్లుకు ఐదుగురు సంతానం. అందరూ ఉన్నత విద్యావంతులే. వీరందరూ ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతానికి వెళ్లి స్థిరపడ్దారు. ఉష తండ్రి ఏరో నాటికల్ ఇంజినీరింగ్ పూర్తిచేసిన రాధాకృష్ణ శాన్‌డియాగో విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. కృష్ణా జిల్లాకు పామర్రుకు చెందిన లక్ష్మితో ఆయనకు వివాహం అయ్యింది. వీరు అప్పట్లోనే అమెరికా వెళ్లి స్థిరపడ్డారు.
ఇక మన తెలుగమ్మాయి ఉషకు ప్రత్యేకంగా ఆహ్వానించేందుకు కేంద్రం ప్రభుత్వం సిద్దమైంది. ఇండియన్ రైల్వే శాఖ ఉషకు అరుదైన కానుక రూపంలో మెమెంటో ఇవ్వనునుంది. దీన్ని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆమెకు అందజేయనున్నారు.