May 2025 Bank Holidays: మే నెల ప్రారంభానికి ముందే ఆ నెలలో బ్యాంకులు ఎన్ని రోజులు పనిచేస్తాయో ఆర్‌బీఐ ప్రకటించింది. వివిధ పనుల నిమిత్తం బ్యాంకులకు ఖాతాదారులు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో బ్యాంకులు ఎప్పుడు పనిచేస్తాయి. ఏ ఏ తేదీల్లో పనిచేయవు అనే వివరాలు తెలసుకోవడం మంచిది. ఏప్రిల్‌లో మొత్తం 15 రోజులపాటు సెలవుల కారణంగా బ్యాంకులు మూతబడ్డాయి. ఇక మేలో కూడా 12 రోజులపాటు బ్యాంకులకు ఆర్‌బీఐ సెలవులు ప్రకటించింది.
మే నెల ప్రారంభానికి ముందే ఆ నెలలో బ్యాంకులు ఎన్ని రోజులు పనిచేస్తాయో ఆర్‌బీఐ ప్రకటించింది. వివిధ పనుల నిమిత్తం బ్యాంకులకు ఖాతాదారులు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో బ్యాంకులు ఎప్పుడు పనిచేస్తాయి. ఏ ఏ తేదీల్లో పనిచేయవు అనే వివరాలు తెలసుకోవడం మంచిది. ఏప్రిల్‌లో మొత్తం 15 రోజులపాటు సెలవుల కారణంగా బ్యాంకులు మూతబడ్డాయి. ఇక మేలో కూడా 12 రోజులపాటు బ్యాంకులకు ఆర్‌బీఐ సెలవులు ప్రకటించింది.
మే నెలలో బ్యాంకు సెలవుల వివరాలు ఇలా ఉన్నాయి...
మే 1 - (గురువారం) మే డే - కార్మికుల దినోత్సవం సందర్బంగా ఏపీ, తెలంగాణతో సహా దేశ వ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
మే 9 - (శుక్రవారం), రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి - కోల్కతాలోని బ్యాంకులకు సెలవు.
మే 12 - (సోమవారం), బుద్ధ పూర్ణిమ - జమ్ము, కాన్పూర్, కోల్కతా, అగర్తలా, ఐజ్వాల్, బేలాపూర్, భోపాల్, డెహ్రూడూన్, ఇటానగర్, రాయ్పూర్, రాంచీ, శిమ్లా, లక్నో, ముంబై, నాగ్పూర్, శ్రీనగర్, ఢిల్లీ లోని బ్యాంకలు పనిచేయవు.
మే 16- (శుక్రవారం), స్టేట్ డే- గ్యాంగ్టక్లోని బ్యాంకులకు పనిచేయవు.
మే 26- (సోమవారం), కాజి నజ్రుల్ ఇస్లామ్- అగర్తలాలోని బ్యాంకులకు సెలవు.
మే 29- (గురువారం), మహారాణ ప్రతాప్ జయంతి - సిమ్లాలోని బ్యాంకులు పనిచేయవు.
వీటితోపాటు బ్యాంకులకు వారాంతపు సెలవులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవులు ఇలా..
మేలో వారాంతపు సెలవులు..
మే 4 - ఆదివారం
మే 10 - రెండో శనివారం
మే 11- ఆదివారం
మే 18- ఆదివారం
మే 24- నాలుగో శనివారం
మే 25 - ఆదివారం
ఇక చెక్కులు, ప్రామిసరీ నోట్ల ఇష్యూకి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరు. కాబట్టి ఖాతాదారులు సెలవు రోజుల్లో కాకుండా మిగిలిన వర్కింగ్ డేస్‌లో బ్యాంకులకు వెళ్లడం మంచింది. దూర ప్రాంతాలకు వెళ్లి అక్కడ పని అవ్వకుండా రావడం వల్ల సమయం వృథా అవుతుంది. పైన తెలిపిన తేదీలను మీ ప్రాంతాలు, బ్యాంకులకు అనుగుణంగా సేవ్ చేసుకుని పెట్టుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది.
యథావిధిగా ఆన్లైన్ సేవలు..
బ్యాంకులకు సెలవులు ప్రకటించినప్పటికీ ఆన్లైన్ సేవలు యథావిధిగా కొనసాగుతాయని ఆర్‌బీఐ తెలిపింది. మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు కొనసాగనున్నాయి. ఏటీఎం సెంటర్ల నుంచి నగదు బదిలీ, విత్ డ్రా వంటి సేవలను కొనసాగించవచ్చు.