తెలంగాణవ్యాప్తంగా బుధవారం మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. మద్యం దుకాణాల ముందు మందుబాబులు బారులు తీరారు. హైదరాబాదులోని కొన్ని ప్రాంతాల్లో మద్యం కోసం మహిళలు కూడా క్యూ కట్టారు.
హైదరాబాద్: తెలంగాణలో బుధవారం మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. దీంతో ప్రజలు పెద్ద యెత్తున రోడ్ల మీదికి వచ్చి వైన్ షాపుల ముందు బారులు తీరారు. మద్యం కొనుగోలు కోసం వారంతా క్యూ కట్టారు. హైదరాబాదులో పలు చోట్ల మహిళలు కూడా రోడ్ల మీదికి వచ్చి వైన్ షాపుల ముందు క్యూ కట్టారు.
ప్రధానంగా హైదరాబాదులోని ఐటి సెక్టార్ లో మహిళలు మద్యం దుకాణాల ముందు క్యూ కట్టారు. ఫిలింనగర్, రాయదుర్గం, హైటెక్ సిటీల్లో మహిళలు బారులు తీరడం కనిపించింది.
undefined
Also Read: తెలంగాణలో తెరుచుకున్న వైన్ షాపులు: చాంతాడులా క్యూలు
ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెలంగాణలో మద్యం దుకాణాలు తెరిచి ఉంటాయి. ఈ లోపలే మద్యం ప్రియులు కొనుగోళ్లు చేపట్టాల్సి ఉంటుంది. రాత్రి 7 గంటల నుంచి కర్ప్యూ కొనసాగుతుంది.
మద్యం దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆదేశించారు. భౌతిక దూరం పాటించకపోతే దుకాణాలు మూసేస్తామని కూడా హెచ్చరించారు. అయితే, మైలార్ దేవ్ పల్లి, తదితర ప్రాంతాల్లో రద్దీని నియంత్రించడం పోలీసులకు తలకు మించిన భారంగా మారింది.
Also Read: తెలంగాణలో మద్యం ధరలు పెంపు: పెంచిన రేట్లు ఇవీ...