హైదరాబాదులో విషాదం: కరోనా భయంతో భవనంపై నుంచి దూకి ఆత్మహత్య

By telugu team  |  First Published May 2, 2020, 10:56 AM IST

కరోనా వైరస్ వ్యాధి సోకిందనే భయంతో ఓ వ్యక్తి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన హైదరాబాదులోని రామంతపూర్ లో చోటు చేసుకుంది. 


హైదరాబాద్:  కరోనా వైరస్ భయంతో మానసిక అందోళన చెందిన ఓ వ్యక్తి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రామంతాపూర్ లో జరిగింది. కుటుంబ సభ్యుల కథనం మేరకు వి ఎస్ అపార్టుమెంటు లోని ప్లాట్ నెంబర్ ౩౦౩ లో నివసించే వాసిరాజు కృష్ణ మూర్తి (60 ) కొద్ది కాలంగా గ్యాస్ సమస్యతో అవస్ధ పడుతున్నాడు.

తరచూ ఆయాసం రావడంతో కరోనా సోకిందేమో అని అందోళన చెందాడు. దీనితో కుటుంబ సభ్యులు కింగ్ కోఠి అసుపత్రికి తీసుకువెళ్లగా కరోనా లక్షణాలు లేవని వైదులు తెలిపారు. .అయినప్పటికీ అయన అందోళన చెందుతుండడంతో శనివారం గాంధీ అసుపత్రికి వెళదామని కుటుంబ సభ్యులు సిద్ధపడుతున్నారు. 

ఆ తరుణంలో అపార్టుమెంటు తన ప్లాట్ బాల్కనీ నుంచి కిందకు దూకడంతో తల పగిలి అక్కడికక్కడే మృతి చెందాడు .దీనితో ఉప్పల్ పొలీసులు మృత దేహన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ అసుపత్రి మార్చురీకి తరలించారు .

Latest Videos

ఇదిలావుంటే, తెలంగాణలో గత 24 గంటల్లో కేవలం 6 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మాత్రమే నమోదైనట్లు ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ శుక్రవారం సాయంత్రం తెలిపారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 1040కి చేరుకుంది. ఈ రోజు 22 మంది వ్యాధి నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 552 ఉన్నాయి.

click me!