హైదరాబాదులోని నేరేడుమెట్టలో ఓ వృద్ధుడు గాంధీ, కేర్ ఆస్పత్రులకు న్యుమోనియా చెకప్ కోసం వెళ్లాడు. అతనికి కరోనా వైరస్ సోకింది. అతని నుంచి భార్యకూ మనవరాలికీ కరోనా వ్యాపించింది.
హైదరాబాద్: న్యుమోనియా చెకప్ కోసం గాంధీ, కేర్ ఆస్పత్రులకు వెళ్లిన 87 ఏళ్ల వృద్ధుడికి కరోనా వైరస్ సోకింది. హైదరాబాదులోని నేరేడుమెట్టలోని ఆ వృద్ధుడి భార్యకు, మనవరాలికి కూడా కరోనా వైరస్ సోకింది. అయితే, వారికి ఏ విధమైన ట్రావెల్ హిస్టరీ లేదు. ఆ వృద్ధుడు నివసిస్తున్న ఆవరణలోని 36 మందిని అధికారులు క్వారంటైన్ కు తరలించారు.
వారందరినీ బేగంపేటలోని నేచర్ క్యూర్ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. నేరేడుమెట్టలోని సిరి కాలనీని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. వారందరికీ పరీక్షలు నిర్వహించగా 15 మందికి నెగెటివ్ వచ్చింది. దాంతో వారిని హోమ్ క్వారంటైన్ కు తరలించారు.
undefined
87 ఏళ్ల వృద్ధుడిని శనివారంనాడు తన వాహనంలో గాంధీ, కేర్ ఆస్పత్రులకు తీసుకుని వెళ్లిన అతని కుమారుడికి మాత్రం కరోనా వైరస్ సోకలేదు. అదే ఇంట్లో ఉంటున్న అతని కోడలికి కూడా నెగెటివ్ వచ్చింది. అతని కుమారుడు మిలిటరీలో పనిచేస్తాడని, కోడలు యవ్వనంలో ఉందని, దాని వల్ల రోగనిరోధక శక్తి ఎక్కువడా ఉండడం వల్ల కరోనా సోకి ఉండనది భావిస్తున్నారు.
మౌలాలీలోని సాదుల్లానగర్, జవహర్ నగర్ ఈస్ట్, మల్కాజిగిరిల్లో మరో ముగ్గురికి కరోనా వైరస్ సోకింది. దాంతో వంద మందిని హోమ్ క్వారంటైన్ కు తరలించారు. ఈ మూడు ప్రాంతాలను కూడా కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. వారి కంటైన్మెంట్ గడువు మే 1వ తేదీతో ముగుస్తుంది.