సమ్మె కాలంలో ఆర్టీసీలో భారీ అవినీతి...: అశ్వత్థామ రెడ్డి

By Arun Kumar P  |  First Published Dec 17, 2019, 9:29 PM IST

ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేపట్టిన కాలంలో భారీ అవినీతి జరిగినట్లు టీఎంయూ నేత అశ్వత్థామ రెడ్డి ఆరోపించారు. దీనిపై విచారణ జరిపి సంబంధమున్న అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 


హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసి ఉద్యోగుల సమ్మె కొనసాగిన కాలంలో భారీ అవినీతి జరిగినట్లు తెలంగాణ మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ అశ్వత్థామ రెడ్డి  ఆరోపించారు. ఇలా సమ్మెకాలంలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం వెంటనే విచారణ చేపట్టాలని... దీనికి పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 

హైదరాబాద్ ఖర్మన్ ఘాట్ లోని చంద్ర గార్డెన్ లో తెలంగాణ మజ్దూర్ యూనియన్ కేంద్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అన్నిజిల్లాలకు చెందిన యూనియన్ ప్రతినిధులు, కార్మికులు హాజరయ్యారు. ఆర్టీసీలో యూనియన్ ఎన్నికలు రెండేండ్ల పాటు వాయిదా వేయడం, యూనియన్లకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేయడంపై  సమావేశంలో  ప్రధానంగా చర్చించారు.

Latest Videos

undefined

READ MORE  Video : యాదాద్రిలో కేసీఆర్...పనులను పరిశీలించిన సీఎం..

ఈ సందర్భంగా అశ్వత్థామ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆర్టీసీలో కార్మిక సంఘాలు ఉండాలో వద్దో రహస్య ఓటింగ్ ద్వారా నిర్ణయించాలన్నారు. ఆర్టీసి ఉద్యోగుల ఉద్యోగ భద్రతపై జీవో విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గతంలో చనిపోయిన కార్మికుల పిల్లలకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. 

సమ్మె విరమణ తర్వాత ఉద్యోగులపై అధికారుల వేధింపులు కొనసాగుతున్నారు. అధికారుల మాటలు విని యూనియన్లకు వ్యతిరేకంగా సంతకాలు చేస్తే పరవాలేదు... చేయకుంటే వేధింపులకు గురిచేస్తున్నట్లు అశ్వత్థామ రెడ్డి పేర్కొన్నారు. 

READ MORE తెలంగాణలో మద్యం ప్రియులకి బ్యాడ్ న్యూస్...భారీగా పెరిగిన ధరలు.. ఏ బ్రాండ్ పై ఎంతంటే..?
 

click me!