హైదరాబాద్ బిర్యానీకి థాయ్ ఉపప్రధాని ఫిదా: పరివారంతో సహా ప్యారడైజ్‌కి..!!

By Siva KodatiFirst Published Jan 19, 2020, 4:24 PM IST
Highlights

భారత పర్యటనకు వచ్చిన థాయ్‌లాండ్ ఉపప్రధాని, ఆ దేశ వాణిజ్య శాఖ మంత్రి లక్సానావిసిట్ హైదరాబాద్‌లో ఉల్లాసంగా గడుపుతున్నారు. ఆదివారం నగరంలోని ప్రఖ్యాత ప్యారడైజ్ హోటల్‌లో హైదరాబాద్ బిర్యానీని రుచి చూశారు

భారత పర్యటనకు వచ్చిన థాయ్‌లాండ్ ఉపప్రధాని, ఆ దేశ వాణిజ్య శాఖ మంత్రి లక్సానావిసిట్ హైదరాబాద్‌లో ఉల్లాసంగా గడుపుతున్నారు. ఆదివారం నగరంలోని ప్రఖ్యాత ప్యారడైజ్ హోటల్‌లో హైదరాబాద్ బిర్యానీని రుచి చూశారు.

Also Read:మున్సిపల్ పోల్స్: కాంగ్రెస్, బీజేపీ ఎంపీలకు సవాల్

శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో లక్సానావిసిట్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, ఇతర అధికారులతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా లక్సానా మాట్లాడుతూ.. లైఫ్ సైన్సెస్‌‌లో హైదరాబాద్ కేంద్రంగా ఉందన్నారు.

Also Read:హైద్రాబాద్‌కు అందలం: ప్రపంచ క్రియాశీల నగరాల జాబితాలో టాప్

భారత్-థాయ్‌లాండ్ మధ్య వాణిజ్య ఒప్పందాలు కొత్త రంగాలకు విస్తరించడం ద్వారా ఇరు దేశ ప్రజలకు మేలు కలుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇతర దేశాలతో వాణిజ్య సంబంధాలను మెరుగుపరచుకునేందుకు థాయ్‌లాండ్ లుక్ వెస్ట్ పాలసీని అనుసరిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా లాజిస్టిక్స్ రంగానికి సంబంధించిన పలు ఎంవో‌యూలను కుదుర్చుకున్నారు.

click me!