TGSRTC: తెలంగాణ‌లో ఆర్టీసీ ప్ర‌యాణికుల‌కు షాకింగ్ న్యూస్‌.. ఆ ధ‌ర‌లు పెంచుతూ నిర్ణ‌యం

Published : Jun 09, 2025, 06:32 PM IST
city bus

సారాంశం

తెలంగాణ ప్ర‌జ‌ల‌పై ఆర్టీసీ షాక్ ఇచ్చేందుకు సిద్ధ‌మైంది. సాధార‌ణ ప్ర‌యాణికుల‌తో పాటు ఉద్యోగుల‌కు, విద్యార్థుల‌పై ఈ ప్ర‌భావం ప‌డ‌నుంది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే..

తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC) ప్రజలకు గట్టి షాక్ ఇచ్చింది. రవాణా సేవలను ఉపయోగించుకునే సాధారణ ప్రయాణికులు, ఉద్యోగులు, విద్యార్థులపై ప్రభావం చూపేలా బస్ పాస్ ధరలను గణనీయంగా పెంచింది. ఈ కొత్త టారిఫ్‌లు ఈ రోజు (జూన్ 9) నుంచి అమల్లోకి వచ్చాయి.

అధికారిక సమాచారం ప్రకారం, పాస్ చార్జీలను సగటున 20% నుంచి 25% వరకూ పెంచినట్టు తెలుస్తోంది. దీనివల్ల ప్రజలపై నెలవారీగా రవాణా ఖర్చులు మరింతగా పెరిగే అవకాశం ఉంది.

తాజా పెరిగిన RTC బస్ పాస్ ధరలు:

ఆర్డినరీ పాస్: రూ. 1,150 నుంచి రూ. 1,400కి పెంపు

మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్: రూ. 1,300 నుంచి రూ. 1,600కి పెంపు

మెట్రో డీలక్స్ పాస్: రూ. 1,450 నుంచి రూ. 1,800కి పెంపు

గ్రేటర్ హైదరాబాద్ పాస్, గ్రీన్ మెట్రో ఏసీ పాస్ ధరలు కూడా స్పష్టంగా పెరిగినట్టు సమాచారం. ధ‌ర‌ల పెంపుతో మధ్యతరగతి ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?