హైదరాబాద్ లో మళ్లీ స్వైన్ ఫ్లూ కలకలం: గాంధీలో గర్భిణి

By telugu teamFirst Published Feb 19, 2020, 11:28 AM IST
Highlights

హైదరాబాదులో మరోసారి స్వైన్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. కరోనా వైరస్ అనుమానితుల్లో పలువురికి స్వైన్ ఫ్లూ సోకినట్లు వైద్యులు చెబుతున్నారు. స్వైన్ ఫ్లూ వ్యాధికి గాంధీ ఆస్పత్రిలో గర్బిణి చికిత్స పొందుతోంది.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో మళ్లీ స్వైన్ ఫ్లూ కలకలం చెలరేగింది. గాంధీ, ఉస్మానియా, చెస్ట్ ఆస్పత్రుల్లో స్వైన్ ఫ్లూ రోగులు చికిత్స పొందుతున్నట్లు సమాచారం. జనరల్ వార్డుల్లోనే వారికి చికిత్స అందిస్తున్నారు. 

ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 30 స్వైన్ ఫ్లూ కేసులు నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి. గాంధీ ఆస్పత్రిలో ఓ గర్భిణి స్వైన్ ఫ్లూ వ్యాధికి చికిత్స పొందుతున్నట్లు వార్తలు వచ్చాయి. 

See Video: వీరంతా కరోనా వైరస్ ఫ్రీ: ఇండ్లకు చేరనున్న చైనా నుంచి వచ్చిన భారతీయులు

కరోనా వైరస్ అనుమానితుల్లో పలువురికి స్వైన్ ఫ్లూ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. చైనాలోని వూహన్ నుంచి వచ్చినవారికి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించిన తర్వాత అది లేదని నిర్ధారించి కొంత మందిని వైద్యులు ఇళ్లకు పంపించేశారు. 

భారత్ లో ఇప్పటి వరకు మూడు కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. అవన్నీ కేరళలోనే నమోదు కావడం విశేషం. కరోనా వైరస్ కలకలం నేపథ్యంలో హైదరాబాదులోని పలు ఆస్పత్రుల్లో చికిత్స అందించడానికి కూడా ఏర్పాట్లు చేశారు. 

See Video: మాంసాహారం తీసుకోవడమే కరోనావైరస్ కు కారణం : స్వామి చక్రపాణి

click me!