గత ప్రభుత్వ హయాంలో చేపట్టని ఉపాధి హామీ బిల్లులను ఈ ప్రభుత్వం వెంటనే చెల్లించేలా చూడాలంటూ టిడిపి ఎమ్మెల్సీలు హైకోర్టును ఆశ్రయించారు.
గుంటూరు: రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరోసారి హైకోర్టును ఆశ్రయించింది టిడిపి. ఉపాది హామీ పనుల పెండింగ్ బిల్లులు చెల్లచకుండా ఇందుకు సంబంధించిన నిధులను మళ్లించటంపై టిడిపి ఎమ్మెల్సీలు హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు చేశారు. రూ.2500 కోట్లు పెండింగ్ బిల్లులు మళ్లింపు చేశారంటూ ఈ పిటీషన్ ద్వారా ఉన్నత న్యాయస్థానానికి తెలియజేశారు టిడిపి ఎమ్మెల్సీలు.
ఈ పిటిషన్ పై టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ... గత చంద్రబాబు ప్రభుత్వం గ్రామాభ్యుదయానికి ఉపాది హామీ పనులు పెద్ద ఎత్తున నిర్వహించారన్నారు. 16 వేల మంది ఎస్సీ, ఎస్టీ, బిసీ సర్పంచులు, స్థానిక సంస్దల ప్రతినిధులు ఉపాధి పనులు చేయించారని అన్నారు. వారికి బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం వేధిస్తోందన్నారు.
read more మంత్రి కన్నబాబు అసంతృప్తి... ఆ శాఖాధికారులకు కీలక ఆదేశాలు
మాజీ సీఎం, టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆదేశాలతోనే న్యాయపోరాటానికి దిగినట్లు తెలిపారు. మిస్ లీనియస్ పిటీషన్ తో పాటు కోర్ట్ దిక్కారం క్రింద కూడా మరికొన్ని పిటీషన్ వేయబోతున్నట్లు తెలిపారు.
గ్రామాల్లో చేసిన పనులకు బిల్లులు ఇవ్వకుండా ఎస్సీ, ఎస్టీ లను ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. దీనికి సంబందించి కోర్టులో వేసిన పిటిషన్ పై మార్చి 2న విచారణ జరుగనుందని అన్నారు. గత ప్రభుత్వంలో పనులు చేసి బిల్లులు రాని ప్రతి ఒక్కరికీ రూపాయితో సహా నిధులు వచ్చేలా చేస్తామని అన్నారు.
టిడిపి నేత ఆలపాటి రాజా మాట్లాడుతూ... పాత ప్రభుత్వ హాయాంలో చేసిన పనులకు బిల్లులు ఇవ్వమని కోర్ట్ చెప్పినా వైసిపి ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవటం దుర్మార్గమన్నారు. పంచాయితీలకు పార్టీ బొమ్మలు, రంగులు వేసుకుని ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని అన్నారు.
read more ఆ పాపం ప్రజలదే... అందుకు వారే బాధితులు...: వర్ల రామయ్య వ్యాఖ్యలు
కోర్ట్ ఉత్తర్వులు కూడ పక్కన పెట్టి వారు తాము అనుకున్నట్లే చేస్తున్నారని... ఈ ప్రభుత్వ దుర్మార్గాలపై కోర్ట్ లోనే పోరాడతామన్నారు. 01.06.2019 తరువాత బిల్లులు ఇవ్వకుండానే ఇచ్చామని కోర్ట్ కు తెలియచేయటం దుర్మార్గమన్నారు. ఈ విషయం గురించి వారంలోగా ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి వివరిస్తామని రాాజా తెలిపారు.