హైదరాబాద్ లో దారుణం... ఐదేళ్ల బాలికపై వృద్దుడి అత్యాచారయత్నం

Arun Kumar P   | Asianet News
Published : Feb 18, 2020, 11:31 AM IST
హైదరాబాద్ లో దారుణం... ఐదేళ్ల బాలికపై వృద్దుడి అత్యాచారయత్నం

సారాంశం

అభం శుభం తెలియని ఓ చిన్నారిపై అఘాయిత్యానికి ప్రయత్నించి ఓ వృద్దుడు కటకటాలపాలయిన సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

హైదరబాద్ లో ఓ డెబ్బైఏళ్ల వృద్దుడు దారుణానికి ఒడిగట్టాడు. మనవరాలి వయసుండే ఓ  ఐదేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడేందుకు ప్రయత్నించాడు. అయితే అతడి చేష్టలతో బయపడిపోయిన చిన్నారి గట్టిగా అరవడంతో ఈ మృగాడి నుండి తప్పించుకోగలిగింది. 

వివరాల్లోకి వెళితే... కుత్బుల్లాపూర్ అయోద్యనగర్ కాలనీకి చెందిన సోమయ్య(70) స్థానిక  ప్రభుత్వ పాఠశాల సమీపంలోనే నివాసం వుంటున్నాడు. ఇంట్లో ఒంటరిగా వుంటున్న అతడికి దారుణమైన ఆలోచన వచ్చింది. ప్రభుత్వం పాఠశాలలో చదువుకునే ఓ ఐదేళ్ల చిన్నారికి  మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఇలా గత నాలుగురోజులుగా ఇలాగే చేస్తున్నాడు.

read more  ఒంటిపై బంగారంతో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

అయితే అతడు ఏం చేస్తున్నాడో తెలీక బాలిక రోజూ అతడితో వెళుతోంది.  ఈ క్రమంలో సోమవారం మద్యాహ్నం మరోసారి బాలికను ఇంట్లోకి తీసుకెళ్లిన సోమయ్య బాలికపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. దీంతో భయపడిపోయిన బాలిక గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు గుమిగూడి ఆ కామాంధుడి నుండి బాలికను కాపాడారు.

అభం శుభం తెలియని బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన సోమయ్యకు  దేహశుద్ది చేశారు. అనంతరం అతన్ని జీడిమెట్ల  పోలీసులకు అప్పగించారు. అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.  

 

PREV
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?