ఇంటర్మీడియట్ లో వందశాతం రిజల్ట్... నలభై లక్షలు: మంత్రి హరీష్ బంపరాఫర్

By Arun Kumar PFirst Published Dec 19, 2019, 6:36 PM IST
Highlights

సిద్దిపేట జిల్లాలోని ఓ ఇంటర్మీడియట్ కాలేజికి ఆర్థిక మంత్రి హరీష్ రావు  బంపరాఫర్ ఇచ్చారు. ఈసారి పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధిస్తే భారీగా నిధులు అందిస్తామని హామీ ఇచ్చారు.  

సిద్దిపేట: జిల్లాలోని బెజ్జంకి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్నిఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సంధర్భంగా ఆయన కళాశాలకు ఓ బంపరాఫర్ ఇచ్చారు. 

''కళాశాలలో అదనపు తరగతి గదుల అవసరమున్నట్లు తెలిపారు. అయితే అదనపు గదుల నిర్మాణానికి రూ.40 లక్షలు కావాల్సి వస్తుంది. ఈసారి ఈ కళాశాలలో వంద శాతం ఉత్తీర్ణత శాతం సాధిస్తే ఈ నిధులను వెంటనే మంజూరు చేయిస్తా. కాబట్టి విద్యార్థులు తమ కోసమే కాకుండా ఇప్పుడు చదువు నేర్పే కాలేజి కోసం కూడా పాసవ్వాల్సి వుంటుంది.'' అని మంత్రి ప్రకటించారు.

ఇంకా విద్యార్థులను ఉద్దేశించి హరీష్ మాట్లాడుతూ... ఇది పరీక్షల సమయం కాబట్టి సమయాన్ని వృధా చేయవద్దన్నారు. పరీక్షలు ముగిసే వరకు సెల్ ఫోన్లు, సోషల్ మీడియా కు దూరంగా ఉండండాలని విద్యార్థులకు సూచించారు. అలాగే టీవీలు, సినిమాలు చూడకుండా పరీక్షల కోసం పుస్తకాలు చదవండని సూచించారు.

పరీక్షలు చాలెజింగ్ గా తీసుకోవాలని.... మంచి మార్కులతో పాసయి తల్లిదండ్రులకు మంచి పేరు‌తీసుకు రావాలని అన్నారు. ఈ ఏడాది ఇంటర్ లో ‌వందకు వంద శాతం ఫలితాలుండాలన్నారు. అసలు పాస్ అవడం కోసం‌ చదవడమేంటని...ఉన్నత స్థాయిలో ఎదగాలంటే మంచి మార్కులతో పాస్ అవ్వాలన్నారు. నిత్యం విజ్ఞానాన్ని పొందాలని సూచించారు. 

read more తెలంగాణను తాకిన రాజధాని సెగ: ఆదిలాబాద్‌లో అసెంబ్లీ సమావేశాలకు డిమాండ్

బెజ్జంకి ‌కళాశాలలో‌ ఎకనమిక్స్, కామర్స్, సివిక్స్ సబ్జెక్టు లలో గత ఏడాది‌ తక్కువ మార్కులు వచ్చాయని, ఈ సారి ఈ సబ్జెక్టుల్లో విద్యార్థులు వందకు వంద శాతం పాస్ కావాలన్నారు. ఈ మేరకు మాట ఇవ్వాలని లెక్చరర్లు‌, విద్యార్థులను మంత్రి కోరగా ప్రతిగా వారందరు మాటిచ్చారు. 

విద్యార్ధుల హాజరు గురించి తెలుసుకున్న హరీష్ బుధవారం 49  మంది విద్యార్థులు రాలేరని... ఇవాళ‌ 29 మంది రాలేదన్నారు. విద్యార్థులు కాలేజీ మానవద్దని...   లెక్చరర్‌ కు కొద్ది మంది విద్యార్థులను కేటాయించి వారు తప్పనిసరిగా కాలేజికి హజరయ్యేలా పర్యవేక్షించాలని సూచించారు. 

తల్లిదండ్రులను కలిసి విద్యార్థులు‌ కళాశాలకు హజరయ్యేలా సమావేశాలు నిర్వహించాలన్నారు. కళాశాలకు రాని విద్యార్థుల విషయంలో గ్రామ సర్పంచ్ ల సాయం తీసుకొని విద్యార్థులు కళాశాలకు వచ్చేలా చూడాలన్నారు. ఇక విద్యాశాఖాదికారులు కూడా ప్రతీ రోజు నాలుగు కళాశాలలు తిరిగాలని ఆదేశించారు విద్యార్థులు చదువుతున్నారా లేదా.. కళాశాలకు వస్తున్నారా లేదా అన్న విషయాలు పరిశీలించాలన్నారు.తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను వ్యవసాయ పనులకు పంపకుండా కళాశాలకు పంపాలన్నారు. 

read more  బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌‌కు పోలీసుల షాక్: రౌడీషీట్ ఓపెన్

 ఇవాళ్టి(గురువారం) నుండి మద్యాహ్న భోజనం ప్రారంభిస్తున్నామని రేపటి(శుక్రవారం) నుండి సాయింత్రం స్నాక్స్ ఏర్పాటు చేస్తామన్నారు. సాయింత్రం ఇక్కడే‌విద్యార్తులు రెండు గంటల‌సేపు చదవాలని సూచించారు. సిద్దిపేట జిల్లాలో ఇంటర్ ఫలితాల్లో బెజ్జంకి కళాశాల తొలి‌ స్థానంలో నిలవాలని హరీష్ సూచించారు. 

click me!