కన్నకూతురిపైనే అత్యాచారం: తండ్రికి పదేళ్లు జైలు శిక్ష

By Siva KodatiFirst Published Nov 20, 2019, 11:29 AM IST
Highlights

కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రి కుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో కామాంధుడికి కోర్టు 10 ఏళ్ల జైలు శిక్షను విధించింది. 

కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రి కుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో కామాంధుడికి కోర్టు 10 ఏళ్ల జైలు శిక్షను విధించింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ వ్యక్తి కొన్నేళ్ల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చి ఆల్వాల్‌లో స్ధిరపడ్డాడు.

Also Read:కుమార్తెపై తండ్రి అత్యాచారం: మూడు నెలల నుంచి పైశాచికం

మద్యానికి బానిసైన ఆ వ్యక్తి గతేడాది ఐదో తరగతి చదువుతున్న తన కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే తండ్రి తనపై చేసిన అఘాయిత్యం ఏంటో కూడా బాలికకు తెలియదు. అయితే ఓ రోజు పాఠశాలలో బాలలపై లైంగిక వేధింపులకు సంబంధించి అవగాహన తరగతులు నిర్వహించారు.

Also Read:దారుణం: కన్నకూతురిని చికటి గదిలో బంధించి...

ఈ సందర్భంగా టీచర్లు చెప్పిన వివరాలను బట్టి తన తండ్రి జరిపిన అత్యాచారాన్ని ఆమె గుర్తించగలిగింది. వెంటనే ఈ విషయాన్ని టీచర్లకు చెప్పడంతో వారు చిన్నారి తల్లీకి చెప్పారు. దీంతో ఆమె ఆల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిపై బాలలపై లైంగిక వేధింపులతో పాటు పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. దీనిపై సుధీర్ఘ విచారణ జరిపిన న్యాయస్థానం నిందితుడికి పదేళ్లు జైలు శిక్షతో పాటు రూ.5 వేలు జరిమానా విధించింది. అంతేకాకుండా బాలిక తల్లికి నష్టపరిహారం కింద రూ.3 లక్షలు ఇవ్వాలని ఆదేశించింది. 

click me!