పెద్ద శబ్ధంతో ఆగిపోయిన హైదరాబాద్ మెట్రో.. ఉలిక్కిపడ్డ ప్రయాణీకులు

By Siva KodatiFirst Published Nov 19, 2019, 8:09 PM IST
Highlights

హైదరాబాద్ మెట్రోలో స్వల్ప అపశృతి చోటు చేసుకుంది. నాగోల్ నుంచి హైటెక్ సిటీ వెళ్తున్న మెట్రో రైలు అమీర్‌పేట స్టేషన్‌కు చేరుకోగానే.. పెద్ద శబ్ధంతో రైలు ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు

హైదరాబాద్ మెట్రోలో స్వల్ప అపశృతి చోటు చేసుకుంది. నాగోల్ నుంచి హైటెక్ సిటీ వెళ్తున్న మెట్రో రైలు అమీర్‌పేట స్టేషన్‌కు చేరుకోగానే.. పెద్ద శబ్ధంతో రైలు ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే పవర్ షట్ టౌన్ కావడంతోనే రైలు నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. 

దీనిపై హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పందించారు. విద్యుత్తు సరఫరాలో సాంకేతిక సమస్యల కారణంగానే రైలు నిలిచిపోయిందన్నారు. బేగంపేట్-అమీర్‌పేట స్టేషన్ల మధ్య ఉన్న విద్యుత్ లైనులో సాంకేతిక సమస్య తలెత్తడం వల్ల మెట్రో సర్వీసుకు అంతరాయం కలుగుతోందన్నారు.

Also Read:బయటపడుతూనే ఉన్న హైదరాబాద్ మెట్రో డొల్లలు: ప్రయాణీకులకు తీవ్ర కష్టాలు

ఈ సమస్య కారణంగా సింగిల్ లైన్ విధానంలో రైళ్లను నడుపుతున్నట్లు ఎండీ వెల్లడించారు. దాంతో మెట్రో రైలు కొంత ఆలస్యం అవుతున్నాయని.. ఈ సమస్య పరిష్కారానికి  మెట్రో అధికారులు కృషి చేస్తున్నారని ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. 

హైదరాబాద్ మెట్రో లోని డొల్లతనాలు రోజుకోటిగా బయటపడుతూనే ఉన్నాయి. నెల రోజుల కింద టెక్కీ మౌనిక మృతిని మనము మరువక ముందే సుశీల్ అనే యువకుడు మెట్రో వారు మొక్కలు నాటేందుకు తీసిన గుంతలోపడి కాలు లిగమెంట్ ని డామేజ్ చేసుకున్నాడు. అప్పటి నుంచి మొదలు మెట్రో నిర్వాకం ఒక్కొక్కటిగా బయటకొస్తూనే ఉంది.

Also Read:హైదరాబాద్ మెట్రోకుతప్పిన ప్రమాదం: 400 మంది ప్రయాణికులు సేఫ్

ఆ తర్వాత పలు ప్రాంతాల్లో మెట్రో రైలు మొరాయించిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతమున్న హైదరాబాద్ జనాభాకు సేవలందించడంలోనే విఫలమైతే భవిష్యత్తులో హైదరాబాద్ జనాభా మరింతగా పెరుగుతుంది. అప్పుడు అంతమందికి సేవలెలా అందిస్తారని పౌర సమాజం ప్రశ్నిస్తుంది. 

click me!