స్మార్ట్ రోడ్ల కోసం తీవ్ర కసరత్తు చేస్తున్న ఆమ్రపాలి

First Published Oct 26, 2017, 5:34 PM IST
Highlights
  • వరంగల్ పట్టణంలో పర్యటించిన కలెక్టర్ ఆమ్రపాలి
  • స్మార్ట్ రోడ్ల అభివృద్దికి ప్రణాళికలు
  • అధికారులకు సూచనలు, సలహాలిచ్చిన కలెక్టర్ 

వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి వరంగల్ నగరంలో రోడ్లను స్మార్ట్ రోడ్లుగా తీర్చిదిద్దే పనిలో పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులతో వరంగల్ నగరంలోని రోడ్లను మరియు కూడళ్లను అభివృద్ది పర్చేందకు ప్రణాళికలు రూపొదిస్తున్నారు. అందుకు సంభందించి ఇవాళ కలెక్టర్  నగర కమీషనర్ శృతి ఓజా, మేయర్ నన్నపునేని నరేందర్లతో కలిసి నగరమంతా కలియతిరిగారు. నగరంలోని రోడ్ల పరిస్థితి, కూడళ్ల వద్ద చేపట్టాల్సిన పనుల గురించి ప్రత్యక్షంగా చూసి ఓ అంచనాకు రావాలని స్వయంగా కలెక్టరమ్మే రంగంలోకి దిగింది.  

 
నగర అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం మంజూరుచేసిన 42 కోట్ల నిధులతో 13జంక్షన్లతో స్మార్ట్ రోడ్లను నిర్మంచనున్నారు. ఇందుకు సంభందించి అభివృద్ది చేయబోయే వివిద కూడళ్లకు ఎంత నిధులు అవసరమవుతాయోనన్న దానిపై అధికారులు అంచనాలు రూపొందిస్తున్నారు.  మొత్తంగా నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి ఆమ్రపాలి తీవ్రంగా కృషి చేస్తున్నారు.
 

click me!