గొర్రెలు తరలిస్తున్న డీసీఎం బోల్తా,  ముగ్గురు మృతి

First Published Feb 8, 2018, 5:51 PM IST
Highlights
  • వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం
  • ముగ్గురు గొర్రెల కాపరులు మృతి

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకంలో అపశృతి చోటుచేసుకుంది. రాష్ట్రంలోని గొల్ల కుర్మలకు గొర్రెలను పంపిణీ చేయడానికి పక్క రాష్ట్రం ఏపి నుండి తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ఇలా ఆంద్రప్రదేశ్ నుండి గొర్రెలు కొనుగోలు చేసి తీసుకు వస్తున్న డీసిఎం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు గొర్రెల కాపరులు చనిపోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. 

 ఈ ప్రమాదం వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండలం వెలిమినేడు గ్రామ శివారులో సంభవించింది.  గొర్రెలను తరలిస్తున్న డీసిఎం అదుపుతప్పి ఓ వంతెనపై నుండి కిందపడింది. ఈ ప్రమాదంలో చంద్రుగొండ గ్రామానికి చెందిన ముగ్గురు గొర్లకాపరులు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమం ఉంది. గాయపడిన వ్యక్తిని స్థానికులు చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించడం జరిగింది. ప్రమాదంలో 55 గొర్రెలు కూడా చనిపోయాయి. 

 ఈ  ప్రమాదంపై యాదవ సంఘాలు తీవ్ర విషాదాన్ని వ్యక్తం చేస్తున్నాయి. తమ కుటుంబ సభ్యులను కోల్పోడమే కాకుండా, గొర్రెల మరణంతో ఆర్థికంగా నష్టపోయిన గొర్లకాపర్ల కుటుంబాలకు ప్రభుత్వం సాయం అందించాలని వారు డిమాండ్ చేశారు. కుటుంబీకులను కోల్పోయిన ఒక్కొ కుటుంబానికి  10లక్షలు ఆర్ధిక సహాయం అందించాలని, అలాగే చనిపోయిన గొర్రెలకు (ఇన్సూరెన్స్) నష్టపరిహారం ఇవ్వాలని యాదవ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

click me!