
ప్రపంచం వ్యాప్తంగా జనాభా లో ఇండియా రెండవ స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జనాభా ను తగ్గించడానికి మార్గాలను ఆలోచిస్తుంది. ఈ మధ్యనే ప్రపంచ జనాభా దినోత్సవం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ రోజు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రకటించింది. ఆ పథకం వివరాలను ప్రకటించలేదు. నేడు ఆ పథకం పేరు షగున్ అని దానికి సంబంధిన వివరాలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.
షగున్ పథకం కిందం నూతనంగా పెళ్లైన జంటలకు కండోమ్స్, గర్భనివారణ మాత్రలను అందిస్తారట. అది కూడా ఎలాంటి ఖర్చు లేకుండా. ఇలా ఇవ్వడానికి కారణం కూడా తెలిపింది. ఇండియాలో జనాభాను తగ్గించడమే ముఖ్య ఉద్దేశంగా షగున్‌ను ప్రజల మధ్యకు తీసుకేళ్లాలని ప్రకటించింది.
షగున్ పథకం కింద ప్లానింగ్ ఆఫరేషన్‌లను కూడా చెయించడానికి ప్రయత్నాలు త్వరలోనే మొదలుపెట్టాలని ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ఇదే పథకాన్ని భారతదేశ వ్యాప్తంగా తీసుకురావడానికి కేంద్రానికి కూడా సూచనలు పంపింది.