తీర‌నున్న ఖైర‌తాబాద్ వినాయకుడి క‌ష్టాలు

Published : Sep 02, 2017, 07:52 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
తీర‌నున్న ఖైర‌తాబాద్ వినాయకుడి క‌ష్టాలు

సారాంశం

ఖైరతాబాద్ గణేషుడి పై సంచలన నిర్ణయం.

ఖైర‌తాబాద్ వినాకుడిని నిమ‌జ్జనం చేయాలంటే ఇప్ప‌టి వ‌ర‌కు ప‌దుల సంఖ్య‌లో ఉస్సేన్ సాగ‌ర్ లోకి దిగి సుత్తేలు తీసుకోని గ‌ణేషుడిని ప‌గ‌లగొట్టేవారు, కానీ ఇక మీద‌ట ఆ అవ‌స‌రం లేదు ఎందుకంటే ఖైరతాబాద్‌ ఉత్సవ సమితి సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి మట్టి వినాయకుడు విగ్రహాన్నే ప్రతిష్ఠిస్తామని వెల్లడించింది. కాలుష్య నివార‌ణకు తాము కూడా క‌ట్టుబ‌డి ఉన్న‌ట్లు గ‌ణేష్ ఉత్స‌వ క‌మిటీ తెలిపింది. మ‌ట్టి గ‌ణేషుడు అయితే ఒక రోజు కాక‌పోయిన ఐదు రోజులు అయినా క‌రిగిపోతుంది.


వ‌చ్చే ఎడాది నుండి సుమారు 80 నుంచి 100 అడుగుల ఎత్తైన మట్టి వినాయకుడిని ఏర్పాటు చేసి.. హుస్సేన్‌ సాగర్‌లోనే నిమజ్జనం చేస్తామని సమితి అధ్యక్షుడు సుదర్శన్‌ వివరించారు. మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని గవర్నర్‌ నరసింహన్‌కు హామీ ఇచ్చామని, శిల్పి రాజేంద్రన్‌ కూడా ఈ విగ్రహం తయారీకి ఒప్పుకున్నారని తెలిపారు. 
ప్లాస్ట‌ర్ ఆఫ్ పారీస్ తో జ‌రుగుతున్న న‌ష్టం భారీగా ఉంద‌ని, ఇక మీద‌ట తాము తీసుకున్న నిర్ణ‌యం పై మ‌ట్టి వినాయ‌క విగ్ర‌హాల వాడ‌కం పై విస్తృత ప్ర‌చారం చేస్తామ‌ని ఆయ‌న హామీ ఇచ్చారు.

 

మరిన్ని తాజా వివరాల కోసం కింద క్లిక్ చేయండి  

 

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)