చెన్నైలో తెలుగమ్మాయి ఆత్మహత్య

First Published Nov 23, 2017, 11:43 AM IST
Highlights
  • చెన్నై సత్యభామ యూనివర్సిటీలో ఉద్రిక్తత
  • తెలుగు విద్యార్థిని రాగమౌలిక ఆత్మహత్యతో ఆగ్రహించిన విద్యార్థులు
  • కళాశాల పర్నీచర్ ద్వంసం
  • కళాశాలకు సెలవులు ప్రకటించిన యూనివర్సిటీ అధికారులు

చెన్నై ఒల్డ్ మహాబలిపురం లోని సత్యభామ విశ్వవిద్యాలయంలో దారుణం జరిగింది. ఈ యూనివర్సిటీలో మొదటి సంవత్సరం సీఎస్ఈ చదువుతోన్న తెలుగు విద్యార్థిని రాగ మౌలిక‌ అవ‌మాన భారంతో ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఆమె ఆత్మహత్యకు కళాశాల అధికారులే కారణమంటూ తెలుగు విద్యార్థులు ఆందోళన చేయడంతో యూనివర్సిటీ ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

వివరాల్లోకి వెళితే రెండు రోజుల క్రితం కాలేజీలో జరుగుతున్న ఇంట‌ర్న‌ల్ ప‌రీక్ష‌ల్లో మౌలిక‌ కాఫీ కొట్టిందన్న కార‌ణంతో ఇన్విజిలేట‌ర్లు ఆమెను పరీక్షహాల్ నుంచి బ‌య‌టికి పంపారు. అయితే బుధవారం మరో పరీక్షరాయడానికి వచ్చిన మౌలికను ఉపాద్యాయులు ఎగ్జామ్ హాల్ లోకి అనుమతించలేదు. అంతే కాకుండా ఆమెను తీవ్రంగా అవమానించినట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు.దీంతో మసస్తాపానికి  గురైన మౌలిక‌ హాస్ట‌ల్ గ‌దిలో ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. 

మౌలిక ఆత్మహత్యతో ఆగ్రహించిన స‌హ‌చ‌ర విద్యార్థులు కాలేజీ ఫ‌ర్నిచ‌ర్ కు నిప్పు పెట్టారు.దీంతో మంట‌లు అదికమవడంతో స‌మాచార‌మందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది రంగంలోకి దిగి ప‌రిస్థితిని అదుపులోకి తీసుకువ‌చ్చారు. పరిస్థితి చేయిదాటుతుండటంతో యూనివర్సీటీ ప్రాంగణంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.  ఈ ఆత్మహత్యపై యూనివర్సిటీనే పూర్తి బాధ్యత వహించాలని అప్పటివరకు ఆందోళన ఆపేదిలేదని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. 

అయితే ప్రస్తుతం సత్యభామ యూనివర్సిటీలో పరిస్థితి అదుపులో ఉందని చెన్నై పోలీస్ కమిషనర్ తెలిపారు. వారం రోజుల పాటు యూనివర్సిటీకి సెలవులు ప్రకటించినట్లు, హాస్టళ్లను మూసివేసి విద్యార్థులను వారి ఇంటికి పంపుతున్న యూనివర్సిటీ సిబ్బంది తెలిపారు.
 

click me!