సంగీత కేసులో పోలీసులపై కోదండరాం సీరియస్

First Published Nov 22, 2017, 6:14 PM IST
Highlights
  • పోలీసులు సంగీత కేసులో నిర్లక్ష్య వహించారన్న కోదండరాం
  • ఇకనైనా వారు ఆమె ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాని డిమాండ్
  • ప్రభుత్వం కూడా ఈ విషయంలో స్పందించాలన్న కోదండరాం

 భర్త చిత్రహింసలతో ధర్నాకు దిగిన సంగీతకు కోదండరాం మద్దతు తెలిపారు.ఆమె దీక్షాస్థలానికి వెళ్లిన కోదండరాం సంగీతకు దైర్యం చెప్పారు. ఆమెకు న్యాయం చేయడంలో పోలీసులు మొదటినుంచి విఫలమయ్యారని అన్నారు. ఇప్పటి వరకు సంగీత స్థానిక పోలీస్ స్టేషన్లో 4 కంప్లెంట్లు ఇచ్చినా పోలీసులు చర్య తీసుకోలేదు. వెంటనే ఆమె ఫిర్యాదుల ఆధారంగా కేసు నమోదు చేసి కుటుంబసభ్యులను కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
ఆడపిల్ల పుట్టిందని, కట్నం తేలేదని ఇలా అనాగరికంగా ప్రవర్తించే వారికి సమాజంలో స్థానం లేదని అన్నారు. ఆమెను భర్త, కుటుంబసభ్యులు శారీరకంగా, మానసికంగా హింసించారని ఆమె తెలిపిందని, సంగీతకు న్యాయం జరగాలని కోరుకుంటున్నట్లు కోదండరాం తెలిపారు.సంగీతకు స్థానిక మహిళలు, మహిళా సంఘాల సభ్యులు మంచి తోడ్పాటు అందిస్తున్నారని అన్నారు.  జేఏసి తరపున ఆమె పోరాటానికి మద్దతు తెలియజేస్తున్నామని కోదండరాం అన్నారు. అలాగే ఆ వ్యవహారంపై ప్రభుత్వం స్పందించి దోషులకు న్యాయం చేయాలని కోదండరాం డిమాండ్ చేశారు.
 

click me!