పల్లె నిద్రలో స్పీకర్ మధుసూదనాచారి (వీడియో)

Published : Feb 10, 2018, 02:07 PM ISTUpdated : Mar 26, 2018, 12:00 AM IST
పల్లె నిద్రలో స్పీకర్ మధుసూదనాచారి   (వీడియో)

సారాంశం

పల్లె ప్రగతి నిద్ర కార్యక్రమాన్ని చేపట్టిన మధుసూదనాచారి ప్రజల్లో ఉండి సమస్యలు తెలసుకునే ప్రయత్నం  

తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి ఎప్పుడూ జనాల్లో ఉండే వ్యక్తి. ప్రజల్లో కలిసిపోయి వారి యోగక్షేమాల గురించి తెలుసుకుంటారు. అలా ఇదివరకు గిరిజనులను హైదరాబాద్ కు తీసుకువచ్చి సిటీ మొత్తాన్ని చూపించిన విషయం తెలింసిందే. అయితే ప్రస్తుతం ఆయన తన నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో పల్లె ప్రగతి నిద్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయకుడనేవాడు ఎప్పుడు ప్రజల మధ్య ఉండి సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించాలని, అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ప్రజాసేవ అంటే నిత్యం ప్రజల్లో ఉండే పరిస్థితి ని తీసుకువచ్చేందుకు పల్లె ప్రగతి నిద్ర చేపడుతున్నట్లు తెలిపారు.  నాయకులంటే ఎన్నికలప్పుడు వచ్చిపోయే సంస్కృతికి కాలం చెల్లిందని అన్నారు.

 

గ్రామంలో నిద్రిస్తున్న స్పీకర్ వీడియో

 

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)