
ఆంధ్రాలో పనిచేస్తున్న ఐపిఎస్ అధికారిపై తెలంగాణలో పోలీసు కేసు నమోదైంది. ఎపిలో ఐపిఎస్ అధికారిగా పనిచేస్తున్న సునీల్ కుమార్ పై వేధింపుల కేసు నమోదు చేశారు తెలంగాణ సిఐడి పోలీసులు.
సునీల్ కుమార్ భార్య అరుణ తనను అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేస్తున్నారని తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సునీల్ కుమార్ పై ఐపీసీ 498ఏ, 506, dp యాక్ట్ 3, 4 కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో సిఐడి ఐజి గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు సునీల్ కుమార్. ఎపి అధికారిపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేయడం తెలుగు పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది.