
శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ బౌలర్లు రాణిస్తున్నారు. నాలుగవ వికెట్ కి కుషాల్ మెండిస్ ను అక్షర్ పటేల్ ఎల్బీడబ్యూ చేశాడు, అంతకుముందు లంక 70 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన తరుణంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ ఉపుల్ తరంగను హార్ధిక్ పాండ్యా అవుట్ చేశాడు, ధాటిగా ఆడుతున్న ఓపెనర్ డిక్ వెల్లాను బుమ్రా పెవిలియన్ చేర్చాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ అయిన డిక్ వెల్లాకు బుమ్రా స్లో డెలివరీని సంధించాడు. ఆ బంతిని కొంచెం ముందుగానే ఆడటంతో మిడ్ వికెట్ లో ఉన్న ధావన్ కు డిక్ వెల్లా ఈజీ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ప్రస్తుతం 24 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్లు కోల్పోయిన లంక 104 పరుగులు చేసింది. మాథ్యూస్ (12) మరో నూతన బ్యాట్స్ మెన్ అయిన మిలింద సిరివర్థన క్రీజులోకి వచ్చాడు.