అదృష్టం అంటే ఈమెదే గురు..!

Published : Jul 26, 2017, 05:28 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
అదృష్టం అంటే ఈమెదే గురు..!

సారాంశం

5డాలర్లతో లాటరీ కొన్న యువతి వారంలో రెండు  సార్లు లాటరీ తగిలింది

‘ అబ్బ..ఈ ఉద్యోగం అదీ నా వల్ల కావడం లేదు..ఒక కోటి రూపాయలు ఏదైనా లాటరీ తగిలితే బాగుండు.. చక్కగా లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు..’ ఇలా మనలో చాలా మంది కలలు కంటూ ఉటారు.. కానీ ఆ ఊహించని కల నిజంగా నిజమైతే... అదే జరిగింది ఒకమ్మాయి విషయంలో...

వివరాల్లోకి వెళితే.. కాలిఫోర్నియాకు చెందిన రోసా డొమింగ్వేజ్ అనే 19ఏళ్ల యువతి ఒకసారి అరిజోనా నుంచి పాసోరోబిల్స్ ప్రాంతానికి వెళుతోంది. దారిలో పెట్రోల్ కోసం ఆమె గ్యాస్ స్టేషన్ కి వెళ్లింది. అక్కడ ఆమె 5డాలర్లతో ఓ లాటరీ కొంది. కానీ అది తనకు తగులుతుందని అసలు ఊహించలేదు. కానీ ఆమెకు ఆ లాటరీలో హాఫ్ మిలియన్ డాలర్లు.. అనే మన కరెన్సీలో మూడున్నర కోట్లకు పై మాటే.

 దీంతో ఆమె ఆనందానికి అవదులు లేవు. దాదాపు ఆనందంతో ఏడ్చేసినంత పని చేసిం ది.  వారం గడవక ముందే ఆమె మరో సారి తన అదృష్టాన్ని పరిక్షించుకుంది. ఈసారి లక్ష డాలర్లు గెలుచుకుంది. దీంతో ఆమె రెండూ కలిపి మన కరెన్సీలో రూ.4.2కోట్లకు పైగానే గెలుచుకుంది.. నిజంగా అదృష్టమంటే ఈమెదే కదా..

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)