టిడిఎల్ పి ఆఫీస్ కు రేవంత్ గుడ్ బై

Published : Oct 26, 2017, 06:30 PM ISTUpdated : Mar 25, 2018, 11:37 PM IST
టిడిఎల్ పి ఆఫీస్ కు రేవంత్ గుడ్ బై

సారాంశం

టీడిఎల్పీ కార్యాలయాన్ని ఖాళీ చేసిన రేవంత్  పార్టీ ఆదేశాలతో ఈ ఖాళీ ప్రక్రియ జరిగిందని సమాచారం  

 తెలుగుదేశం ఎమ్మెల్యే, ప్రస్తుత టిడిఎల్పీ లీడర్ రేవంత్ రెడ్డి టిడిఎల్పీ కార్యాలయాన్ని ఖాళీ చేశారు. రేవంత్ పార్టీ మారతాడన్న ఊహగానాల నేపథ్యంలో ఆయన కార్యాలయాన్ని ఖాళీ చేయడం రాజకీయ  వేడి మరింత పెరిగింది. కాంగ్రెస్ లో చేరడానికి రంగం సిద్దం చేసుకోవడంలో ఇది భాగమా, లేక తెలుగుదేశం పార్టీ ఆదేశాలతో ఈ పని చేసాడా అన్న ప్రశ్న నెలకొంది. అయితే తెలుగుదేశం తెలంగాణ అద్పాయక్ర్టీష్ుడు రమణ ఆదేశాలతోనే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయని సమాచారం.అయితే  చంద్రబాబు నాయుడు అనుమతి లేకుండా రమణ స్వయంగా రేవంత్ ని పదవి నుంచి తొలగించగలడా  అన్న చర్చ ఇపుడు రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది.
రేవంత్ డిల్లీలో రాహుల్ ను కలిసినప్పటి నుంచి అటు తెలుగుదేశం పార్టీలో, ఇటు కాంగ్రెస్ లో అలజడి మొదలైంది. కొందరు తెలుగుదేశం నేతలు బాహాటంగానే రేవంత్ పై విమర్శలు చేయడం, టిటిడిపి అద్యక్షుడు రమణ కూడా రేవంత్ పై గుర్రుగా ఉన్నాడు. ఈ నేపధ్యంలోనే రమణ పార్టీ జాతీయాద్యక్షుడు చంద్రబాబుకు  రేవంత్ రెడ్డిని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, టీడిఎల్పీ పదవుల నుంచి తొలగించాల్సిందిగా లేఖ రాసినట్లు సమాచారం. దానిని అనుమతి వచ్చినట్లు టిడిపి వర్గాల్లో వినబడుతూ ఉంది. 
ఈ పరాణామాలన్ని నిశితంగా పరిశీలించిన రేవంతే టీడిఎల్పీ కార్యాలయాన్ని ఖాళీ చేశారని తెలుస్తున్నది. రేవంత్ అనుచరులు కొందరు  గురువారం ఉదయం టీడిఎల్పీ కార్యాలయం ఖాళీ చేశారు. ఆఫీసు  నుంచి  ఫైల్స్, కంప్యూటర్లు మరియు ఆయనకు సంబంధించిన ఇతర సామాగ్రిని తీసుకువెళ్లారు. ఈ పరిణామంతో తదుపరి ఏం జరగబోతోందన్న దానిపై అందరికి ఆసక్తి నెలకొంది.

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)