
గతంలో మసీదుల నుంచి వచ్చే ఆజాన్ సౌండ్‌కు నిద్రపట్టడంలేదని బాలీవుడ్ గాయకుడు సోనూ నిగమ్ చేసిన ట్వీట్ అప్పుడు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సోనూ నిగమ్ పై ముస్లింల భారి స్థాయిలో విరుచుకుపడ్డారు. అతడి గిండు గీసీ ఉరేగిస్తే 11 లక్షలు ఇస్తానని ముస్లీం మత పెద్ద పత్వా జారీ చేశార. వాళ్లు గీసేది ఎంటీ నేనే గీసుకుంటానను అని మీడియా ముందు గుండు గీయించుకున్న విషయం కూడా తెలిసిందే. అనంతరం ఆయన దేశంలో మతాల సంబంధిత ప్రచారం పై చర్చ జరగాలని ఆయన సూచించారు.
ఇప్పుడు ఇదే విషయాన్ని బాలీవుడ్ నటి, గాయిని సుచిత్ర ప్రస్తావించారు. ఆజాన్ వల్ల చెవులు పగిలిపోతున్నాయని ట్వీట్టర్‌లో ప్రస్తావించారు. ప్రతి రోజు ఆజాన్ పిలుపునిచ్చి ఇలా మతతత్వాన్ని ఇతరులపై ప్రదర్శించడంకంటే మూర్ఖమైన పని మరొకటి ఉండదు’ అని ట్వీట్ చేశారు. దాంతో కొందరు నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మతాన్ని కించపరిచే హక్కు ఎవరికీ లేదని మండిపడుతున్నారు. కొందరు నెటిజన్లు పుచిత్రకు సపోర్టు చేస్తున్నారు