
కాగ్ నివేదికలో ఇచ్చి కనీసం మూడు రోజులైనా కాలేదు అప్పుడే రైల్వే పుడ్ లో బొద్దింక ప్రత్యక్షం. రైల్వే పుడ్ లో సరైన ప్రమాణాలు పాటించడం లేదని కాగ్ గురువారం తెలిపింది. రైల్వే పుడ్ లో పురుగులు, బొద్దింకలు కలుస్తున్నాయని తెలిపింది. అయితే రాజధాని ఎక్స్‌ప్రేస్ కు కూడా అలాంటి సంఘటనే జరిగింది. అందుకు వారం పాటు రాజధాని ఎక్స్‌ప్రేస్‌ను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద నిలిపివేయాలని డిమాండ్ చేశారు ప్రయాణికులు.
జూలై 21 వ తేదీన మహ్మద్ మదస్సీర్ అనే ప్రయాణికుడు తనకి రైల్వే శాఖ అందించిన తిను బండారంలో చనిపోయిన బొద్దింక కనిపిందింది. దానిని ఫోటో తీసి మహ్మద్ తన ట్వీట్టర్ అకౌంట్ లో పెట్టాడు. దానిని రైల్వే మినిష్టర్ సురేష్ ప్రభుకు ట్యాగ్ చేశాడు. మహ్మద్ తన ఫుడ్ ప్యాకెట్ ఫోటోను, చనిపోయిన బొద్దింకతో పాటు అతని ఫిర్యాదును పోస్ట్ చేశాడు. ప్రయాణీకులు ట్వీట్ చేస్తూ, , నేను రైలు 12785 లో ఉన్నాను మరియు కాచిగూడా స్టేషన్ ప్లాట్ఫామ్ క్యాంటీన్లో కొనుగోలు చేసిన ఆహారంలో నేను బొద్దింకను కనుగొన్నాను. నా PNR # 4546444256. " ఇదే విషయం దక్షిణ మధ్య రైల్వే అధికారులకు చేరింది.
ఈ ఆహార వినియోగం తర్వాత నేను అసౌకర్యంగా ఉన్నాని, తన ఆరోగ్యం స్థిరంగా లేదని, ఆ క్యాంటీన్ పై కఠినమైన చర్య తీసుకోండి, నాకు ఆరోగ్యం బాగు కోసం ఆసుపత్రి ఖర్చులు ఇప్పించాల్సింది తన తదుపరి ట్విట్ లో ముదస్సీర్ పోస్ట్ చేశాడు.
బొద్దింక గొవడపై అధికారులు చర్యలు తీసుకున్నారు.
అహ్మద్ పోస్ట్ తో రంగంలోకి దిగిన రైల్వే అధికారులు ఆ క్యాంటీన్ పై తగిన కఠిన చర్యలు తీసుకున్నారు. ఆదివారం నాడు ఆ క్యాంటీన్లో సోదాలు జరిపారు. క్యాంటీన్ యాజమాని పైన రూ 10,000 జరిమానా విధించారు. అంతేకాకుండా ఇక మీదట ఇలాంటి కల్తీ పుడ్ ప్రయాణికులకు సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దానితో పాటు ఒక తీవ్రమైన హెచ్చరిక లేఖ ను అందించారు అధికారులు. అయితే మదస్సీర్, కొంత మంది ప్రయాణికులు క్యాంటీన్ పైన మరిన్ని కఠిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.