ఈ వైన్ ధరవింటేనే కిక్కెక్కుతుంది

Published : Jul 21, 2017, 07:04 AM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
ఈ వైన్ ధరవింటేనే కిక్కెక్కుతుంది

సారాంశం

వైన్ బాటిల్ వేలం వేసిన పెన్‌పోల్డ్స్‌ కంపెనీ  26 లక్షల రికార్డు ధరకు అమ్మకం

 

సాధారణంగా మందుబాబులకు పెగ్గేస్తేనే కిక్కెక్కుతుంది.కానీ  ఆస్ట్రేలియాలో ఇటీవల వేలం వేసిన   వైన్ బాటిల్ ధర వింటే కూడా కళ్లు బైర్లుకమ్ముతాయి. అదే  ఆరవై ఏళ్ల నాటి ఈ రెడ్‌ వైన్‌  బాటిల్‌.  వేలం పాటలో  భారీ మొత్తాన్ని రాబట్టి నిర్వాహకులకు కాసులవర్షం కురిపించింది.


 పెన్‌పోల్డ్స్‌ కంపెనీకి చెందిన  ఈ బాటిల్‌ 1951 సంవత్సరానికి చెందింది. దాన్ని వేలం వేయగా 26 లక్షల రికార్డు ధర పలికింది.   దీంతో ఆస్ట్రేలియాలోనే అత్యధిక ధరకు   అమ్ముడుపోయిన  వైన్‌ బాటిల్‌గా రికార్డుల్లో నిలిచింది.


1844 నుంచి పెన్‌ఫోల్డ్స్‌ సంస్థ వైన్స్‌ను ఉత్పత్తి చేస్తున్నప్పటికి,  1951 సంవత్సరం నుంచి  వైన్‌ బాటిల్స్‌ను దాచి పెట్టడం మొదలుపెట్టింది.  వాటిలోనిదే ఈ సంస్థ తాజాగా వేలం వేసిన బాటిల్‌.  ఇలాంటివి మరో 20 బాటిల్స్ వరకు తమ వద్ద ఉన్నాయని  పెన్‌ఫోల్డ్స్‌  సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు.


 ఆస్ట్రేలియా చరిత్రలోనే అత్యంత ఖరీదైన మద్యం బాటిల్‌గా దీని పేరు అక్కడ మారుమోగుతోంది. దేశ చరిత్రలోనే  ప్రఖ్యాతిగాంచిన వైన్‌గా అక్కడ మంచి గిరాకీని సంపాదించుకుంది ఇప్పుడా వైన్ బాటిల్.  

 

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)