రాష్ట్రపతికి మెర్సిడెజ్‌ బెంజ్‌ ఇ-క్లాస్‌

Published : Jul 21, 2017, 02:02 AM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
రాష్ట్రపతికి మెర్సిడెజ్‌ బెంజ్‌ ఇ-క్లాస్‌

సారాంశం

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ప్రత్యేక భద్రత రూ 3.5 కోట్లతో  బుల్లెట్‌ప్రూఫ్ కారు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాట్లు

 
 
రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్‌నాథ్‌ కోవింద్‌ ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేస్తోంది సిద్దరామయ్య సర్కారు. దేశ ప్రథమ పౌరుడికోసం  ప్రత్యేకంగా డిజైన్ చేసిన కారును సమకూర్చాలని కర్ణాటక ప్రభుత్వం భావిస్తోంది.

 
అందుకోసం  జర్మనీకి చెందిన  మెర్సిడెజ్‌ బెంజ్‌ ఇ-క్లాస్‌ కారును రూ.3.5 కోట్లతో  కొనుగోలు చేయనుంది.     భద్రత చర్యల్లో భాగంగా పరిపాలన, ఇంటెలిజెన్స్‌ విభాగాలతో సుదీర్ఘంగా చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు.    కొత్తకారు త్వరలోనే  రానుందని అధికారులు తెలిపారు.


 ఈ  బుల్లెట్‌ప్రూఫ్ కారులో విలాసవంతంగానే కాకుండా రక్షణ పరంగా ఎన్నో  ప్రత్యేకతలున్నాయి.   ప్రమాదాలను ముందుగానే పసిగట్టే సాంకేతికను ఈ కారులో వాడారు.  7కు పైగా ఎయిర్‌బ్యాగ్‌లు కలిగి ప్రమాద తీవ్రతను తగ్గించే పకడ్బందీ ఏర్పాట్లను కలిగివుంది.   360 డిగ్రీల కోణంలో రహస్య కెమెరాలు, సులభమైన డ్రైవింగ్‌ కోసం ఇంటెలిజెన్స్‌ డ్రైవింగ్‌ సిస్టమ్‌, టచ్‌ స్ర్కీన్‌ వ్యవస్థలు కూడా కారులో ఉన్నాయి. పూర్తి  రక్షణాత్మకంగా ఉండే  ఈ కారును రాష్ట్రపతి  కర్ణాటక పర్యటనకు  వచ్చినపుడు మాత్రమే వినియోగిస్తారని అధికారులు తెలిపారు.   

 

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)