
రవిశాస్త్రి ఇండియా హెడ్ కోచ్‌గా పగ్గాలు అప్పగించిన నాటి నుండి తన దూకుడును ప్రదర్శిస్తున్నారు. మొదట జహిర్ ఖాన్‌ను బౌలింగ్ కోచ్‌గా బిసిసిఐ నియమిస్తే ఆయనను తిరస్కరించి తన సన్నిహితుడైనా అరుణ్ భరత్‌ని ఎంపిక చెసేలా తెర వెనుక పావులు కదిపాడు. ఇప్పుడు మరో ప్రయత్నం ప్రారభించాడు రవిశాస్త్రి.
ప్రపంచ వ్యాప్తంగా తన బ్యాటింగ్ స్లైల్‌తో కోట్లాది ప్రేక్షకులను సంపాధించిన సచిన్ టెండూల్కర్ రవిశాస్త్రికి కావాలట. జాతీయ జాతీయ జట్టుకు కన్సల్టెంట్‌గా పనిచేయాలని బిసిసిఐకి ప్రతిపాధనలు పంపాడు. సచిన్ ను జట్టుకు అవసరమైనప్పుడు సలహాదారుడిగా ఉండాలనే ఆలోచనను బిసిసిఐకి రవిశాస్త్రి కోరారు. సచిన్ కమిటీ రవిశాస్త్రిని హెడ్ కోచ్‌గా నియమించారు. ఇప్పుడు రవిశాస్త్రి జట్టుకి సలహాధారుడిగా పని చెయ్యాలని కోరుకుంటున్నారు.
కానీ సచిన్ ఇప్పటికే బిసిసిఐ లో పలు రకాల బాద్యతలలో ఉన్నారు. దీనికి తోడు ముంబై ఇండియన్స్ జట్టుకు మెంటర్‌గా పని చేస్తున్నారు. మరీ ఇంత బీజి పరిస్థితుల మధ్య రవిశాస్త్రి పెట్టిన ప్రతిపాధనను అంగీకరిస్తారా..! సచిన్ భారత జట్టు ఎక్కడ ఉన్న సలహాలు సూచనలు అందిస్తానని పదవి విరమణ సమయంలో చెప్పారు.