
తిరుమలలో నేరగాళ్లకు చెక్ పెట్టడం కోసం టిటిడి అధిస్థానం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇక మీదట తిరుమల దేవస్థానం ను జీరో క్రైమ్ ప్రాంతమే లక్ష్యంగా టిటిడి అధికారులు నడుం బిగించారు. అందులో భాగంగా తిరుమల దర్శనానికి తరలి వచ్చే భక్తులపై నిఘా మరింత పెరగనుంది. ఇక మీదట తిరుమలలో ఫేస్ డిటెక్షన్ కెమెరాలను అమర్చుతున్నారు. వీటి ప్రథమ లక్షణం నేరగాళ్లను గుర్తించడం. అదేలా అనుకుంటున్నారా...
ఎవరైనా నేరం చేసి పోలీసుల రికార్డులలో పేరు, ఫోటో నమోదు అయితే. ఇక తిరుమల దర్శనం కష్టమే. కేవలం నేరగాళ్లను గుర్తించడానికే ఈ వ్యవస్థను తీసుకొస్తున్నారు. ఫేస్ రికగ్నేషన్ ముఖ్య ఉద్ధేశ్యం పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుంటున్న నేరగాళ్లను గుర్తించడానికి ఈ కేమేరాలు బాగా ఉపయోగపడుతుంది.
ఈ కెమేరాలను పోలీసుల పాత నేరగాళ్ల రికార్డుకు జోడిస్తారు. వాళ్లు ఈ కెమేరా కు చిక్కితే పోలీసులకు తక్షణమే అలార్ట్ పోతుంది. శ్రీవారి మెట్లు అరిపిరి వద్ద 22 కెమెరాలను అమర్చుతున్నారు. అంటే నేరం చేసిన కేటుగాళ్లు తిరుమల మెట్లు ఎక్కడం కూడా కష్టమే. ఇదే వ్యవస్థను తిరుమల వ్యాప్తంగా అమలు చెయ్యడానికి టిటిడి అధికారులు ప్రయత్నం చేస్తున్నారు.