గుజరాత్ లో మరింత తగ్గనున్న పెట్రోల్ ధరలు

First Published Oct 5, 2017, 4:26 PM IST
Highlights
  • గుజరాత్ లో పెట్రోల్ పై వ్యాట్ రద్దు
  • కేంద్ర ప్రభుత్వ సూచనతో నిర్ణయం

వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంతో గుజరాత్ ప్రభుత్వం ఎప్పుడూ ముందే ఉంటుంది. అలాంటి రాష్ట్రం ఎన్నికల ముందు ఊరికే ఉంటుందా...ఉండదు కదా. అవును ఇపుడు గుజరాత్ ప్రభుత్వం రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టకుని ఓ సరికొత్త నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలో పెట్రోల్ పై విధిస్తున్న వ్యాట్ ను రద్దుచేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో పెట్రోల్ పై వ్యాట్ ను రద్దు చేసిన మొదటి రాష్ట్రంగా గుజరాత్ నిలిచింది. 
ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలు పెరగతుండటంతో ప్రజాగ్రహానికి గురైన కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌ పై లీటరుకు రెండు రూపాయలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇదే మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్ ను తగ్గించి ప్రజలకు తక్కువ ధరలకు ఇంధనాన్ని అందించాలని సూచించింది. కేంద్ర పిలుపును అందుకున్న గుజరాత్ సర్కార్  ఈ మేరకు వ్యాట్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 
 గత కొంత కాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువస్తున్నాయి. దీంతో కేంద్రం ఈ ధరలు తగ్గించి ప్రజల్లోకి పాజిటివ్ సంకేతాలు పంపించింది. అదే బాటలో నడిచి గుజరాత్ సర్కార్ కూడా పెట్రోల్ పై సుంకాన్ని తగ్గించుకుని ప్రజలకు దగ్గరయ్యే పనిలో పడింది.  ఇలా అటు కేంద్ర ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు దిద్దుబాటు చర్యలకు దిగింది.
 

click me!